మీ లైఫ్ టైం పెంచుకోవాలనుంటే ఈ పద్ధతిని ఫాలో అవ్వండి….!

Join Our COmmunity

మీ లైఫ్ టైం పెంచుకోవాలనుంటే ఇదే సరైన పద్దతి. అలానే మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయితే మరి పూర్తిగా దీని గురించి ఇప్పుడే తెలుసుకోండి. రోజుకి 11నిమిషాల పాటు ఎక్సర్‌సైజ్ కనుక చేస్తే అది మీ లైఫ్‌కు బోనస్ టైం యాడ్ చేస్తుంది. ఇది నిజమేనండి. మీరు ఎక్సర్‌సైజ్ ని ఎక్కడైనా చెయ్యొచ్చు. రోజు ఇంట్లో చేసుకున్న చాలు. ఇలా చిన్న ఎక్సర్‌సైజ్ సుదీర్ఘ ఫలితాలను రాబడుతుంది. తక్కువ లో తక్కువ 11నిమిషాలు చేస్తే చాలు లైఫ్ స్పాన్ పెంచేసుకోవచ్చు.

దీని కోసం మీరు పెద్దగా కష్టపడిపొక్కర్లేదు. చిన్న చిన్న వర్కౌట్ లేదా తిన్న తర్వాత కాసేపు నడవడం చేసినా చాలు. ఏదైనా 11నిమిషాల పాటు చేస్తే మేలు కలుగుతుందని అంటున్నారు నిపుణులు. నార్వే స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ యాక్టివిటీలను మానిటర్ చేసే ఎక్సర్‌సైజ్‌ను ట్రాక్ చేసింది. ఎటువంటి ఎక్సర్‌సైజ్‌ చేయనివారి డేటాను కూడా పరిశీలించింది.

వీటిలో ప్రధానంగా చెప్పుకోదగ్గది ఏమిటంటే 11నిమిషాలు ఎక్సర్‌సైజ్‌ చేసిన వారిలో గమనించ దగ్గ మార్పులు కనిపించాయి. క్రమం తప్పకుండ రోజుకి 11నిమిషాలు గుంజీళ్లు లాంటివి చేయడం వల్ల మంచి ఫలితాలు ఎదుర్కోవచ్చు. అలానే కొద్ది దూరం నడవడం కూడా బెనిఫిట్ అని నిపుణులు అంటున్నారు. కాబట్టి మంచిగా ఆరోగ్యంగా ఉండడం కోసం రోజుకి 11నిమిషాలు వీటిపై వెచ్చించండి.

TOP STORIES

సలాం.. మేజర్ మోహిత్ శర్మ..!

మేజర్ మోహిత్ శర్మ.. 19978 జనవరి 13వ తేదీన హర్యానాలోని రోహ్ తక్ గ్రామంలో జన్మించారు. ఇతని తల్లిదండ్రులు రాజేంద్రప్రసాద్, సుశీల. మేజర్ మోహిత్ శర్మను...
manalokam telugu latest news