ఈ మధ్యకాలంలో గుండెకు సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి. అయితే గుండె ఆరోగ్యం కోసం ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తప్పకుండా తీసుకోవాలి. అదే విధంగా జీవన విధానాన్ని కూడా మార్చుకోవాలి. ఎప్పుడైతే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారో, శరీరానికి సరైన పోషకాలు అందుతాయి. ఈ విధంగా గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అయితే మీ రోజువారి ఆహారంలో భాగంగా కొన్ని రకాల గింజలను తీసుకోవడం వలన గుండె ఆరోగ్యం మరింత మెరుగు పడుతుంది. దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
ఆరోగ్యానికి చియా సీడ్స్ ఎంతో ఉపయోగపడతాయి. వీటిలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అదేవిధంగా వీటి ద్వారా ఫైబర్ ను కూడా పుష్కలంగా పొందవచ్చు. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి చియా సీడ్స్ ఎంతో సహాయం చేస్తాయి. ఆహారంలో భాగంగా నువ్వులను తప్పకుండా తీసుకుంటే పూర్తి ఆరోగ్యం బాగుంటుంది. వీటిలో ఉండే ఎన్నో పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోజు తీసుకునేటువంటి ఆహారంలో పొద్దుతిరుగుడు విత్తనాలు తీసుకుంటే మెగ్నీషియం, కాపర్, ప్రోటీన్, విటమిన్ ఈ ను పొందవచ్చు. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
చాలా తక్కువ శాతం మంది మాత్రమే మెంతుల రుచిని ఇష్టపడతారు. అయితే మెంతులలో సాల్యుబుల్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కనుక రోజువారి ఆహారంలో భాగంగా తప్పకుండా మెంతులను చేర్చుకోండి. ఇలా చేయడం వలన గుండెకు ఎంతో ఉపయోగం ఉంటుంది. పైగా గుండె సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అదేవిధంగా గుమ్మడి గింజలు కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, జింక్ వంటి మొదలైన పోషకాలు ఉంటాయి. కనుక ఈ ఆహార పదార్థాలను తప్పకుండా తీసుకోవడం వలన గుండె పనితీరు ఎంతో మెరుగుపడుతుంది.