ఎక్కువ మాంసం తింటే ఆయుష్షు నిజంగా తగ్గుతుందా?

-

ఆధునిక జీవన శైలిలో ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. మాంసం ఎక్కువ తింటే ఆయుష్షు తగ్గుతుందా అనే ప్రశ్న చాలా మందిని వేధిస్తుంది. కొందరు నిపుణులు మాంసాహారం ఆరోగ్యానికి మంచిది కాదు అని చెబుతుంటే, మరికొందరు దాని వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. ఇక ముక్క లేనిది ముద్ద దిగదు అనేవారు ఎక్కువకాలం జీవించలేరని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యాయంలో వెల్లడైంది. మరి మాంసం ఎక్కువగా తినడం వల్ల ఆయుష్షు పై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..

ఎక్కువ మాంసం తినడం వల్ల ఆయుష్షు తగ్గుతుందా అనే చర్చ ఎప్పటినుంచో నడుస్తుంది దీనిపై అనేక పరిశోధనలు జరిగాయి. మాంసం ముఖ్యంగా ప్రాసెస్ అండ్ రెడ్ మీట్ తినడం ఆరోగ్యానికి హానికరం అని తేలింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో ఈ విషయాన్ని వెల్లడించారు.4,75,000 మందిపై చేసిన అధ్యయనంలో మాంసం తినడం వల్ల క్యాన్సర్ గుండె జబ్బులు డయాబెటిస్ వంటి 25 రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని గుర్తించారు. రోజు లేదా వారానికి మూడు కంటే ఎక్కువ సార్లు తినేవారు ఇటువంటి ప్రమాదాల గురి అవుతున్నారని తెలిపారు.

Is Eating Meat Daily a Risk to Long Life
Is Eating Meat Daily a Risk to Long Life

ఎర్ర మాంసంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది ఇది కొలెస్ట్రాలను పెంచి గుండె జబ్బులకు దారితీస్తుంది ప్రాసెస్ చేసిన మాంసం లో ఉప్పు నైట్రేట్స్  ఇతర రసాయనాలు ఎక్కువగా ఉంటాయి వీటిని ఎక్కువగా తినడం వల్ల పేగు క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. అయితే ఆరోగ్యకరమైన మాంసం ముఖ్యంగా చేపలు, కోడి మాంసం సరైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మాంసంలో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి చేపల్లో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఆయుష్షు పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి మాంసం తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. మాంసాన్ని మితంగా తీసుకోవాలి ప్రతిరోజు కాకుండా వారానికి రెండు సార్లు మాత్రమే మాంసం తినడం మంచిది. ఎర్ర మాంసానికి బదులుగా చేపలు కోడి మాంసం వంటి ఆరోగ్యకరమైన మాంసానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మాంసం తో పాటు కూరగాయలు పండ్లు, తృణధాన్యాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి గుండె జబ్బులు రాకుండా రక్షణ కల్పిస్తాయి. ఇక మాంసాన్ని వేయించడం కంటే కాల్చడం, ఉడికించడం లేదా ఆవిరి మీద ఉడికించడం వంటి పద్ధతులు ఆరోగ్యకరమైనవి.

మొత్తంగా మాంసం తినడం వల్ల ఆయుష్షు తగ్గుతుంది అనేది తీసుకునే మోతాదు పై ఆధారపడి ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యానికి మాంసాన్ని మితంగా ఆరోగ్యకరమైన పద్ధతిలో తీసుకోవడం అవసరం.

(గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది.)

Read more RELATED
Recommended to you

Latest news