2027 వన్డే ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండాలని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. ప్రపంచ కప్ ఎవరు గెలిపిస్తారు చూడాలి అని రాయుడు అన్నారు. రోహిత్ సారధిగా ఉన్నట్లయితే ప్రపంచకప్ గెలవడం సాధ్యమవుతుంది. ఇందుకోసం అతడు 2027 వరకు రిటైర్మెంట్ తీసుకోకూడదు. వన్డేల్లో రోహిత్ స్థానాన్ని ఎవరూ కూడా భర్తీ చేయలేరు.
రోహిత్ శర్మ కెప్టెన్సీ, బ్యాటింగ్ తీరు అద్భుతంగా ఉంటాయి. ప్లేయర్లకు రోహిత్ ఆట తీరు చాలా బాగా నచ్చుతుంది. అతడు ప్లేయర్లకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తాడు అంటూ అంబటి రాయడు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంబటి రాయుడు మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా, రోహిత్ శర్మ టెస్టులు, టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కేవలం వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడతానని స్పష్టం చేశాడు. వన్డే మ్యాచ్లలో కూడా రోహిత్ శర్మనే కెప్టెన్ గా ఉండాలని క్రికెటర్లు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.