తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ రేపు రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవాళ అలాగే రేపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కులుస్తాయని అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

అదే సమయంలో.. శ్రీకాకుళం మన్యం అల్లూరి జిల్లాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. మిగిలిన జిల్లాలలో తేలికపాటి వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. అటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో.. వస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది.