మనలో చాలా మందికి కాఫీతోనే ఉదయం మొదలవుతుంది. కాఫీ తాగడం వల్ల నిద్ర మాయమవుతుంది, మన శరీరం కొత్త శక్తిని పొందినట్టు ఫీల్ అవుతూ ఉంటాం, దానికి కారణం కాఫీలో ఉండేటు వంటి కెఫిన్ అనే పదార్థం. ఆరోగ్య నిపుణుల ప్రకారం అధిక మోతాదులో కాఫీను తాగడం ప్రమాదకరమే అని అంటున్నారు. కాకపోతే సరైన మోతాదులో రోజు కాఫీ తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనమే. ప్రతి రోజూ కాఫీ తాగే వారికి కొన్ని వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
కాఫీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :
మెమరీ కొరకు :
ఎప్పుడైతే కాఫీ తాగుతామో కెఫైన్ మన శరీరంలో ఉండేటు వంటి రక్తం గ్రహిస్తుంది మరియు అది బ్రెయిన్ కు చేరుతుంది. కాఫీను రోజు తాగడం వలన మెమరీ, మూడ్, అలర్ట్నెస్, ఎనర్జీ లెవెల్స్, రియాక్షన్ టైమ్స్ మరియు జనరల్ మెంటల్ ఫంక్షన్ మెరుగుపడుతుంది.
కొవ్వు తగ్గుతుంది:
కాఫీ తాగడం వల్ల కొవ్వు కరుగుతుంది, కెఫిన్ వల్లనే కొవ్వు కరుగుతుంది. చాలా పరిశోధనల ప్రకారం కెఫిన్ తీసుకోవడం వల్ల మెటబాలిక్ రేటు 3 నుండి 11 శాతం వరకు పెరుగుతుంది. ముఖ్యంగా ఊబకాయం సమస్యకు చాలా ఉపయోగపడుతుంది.
డయాబెటిస్ సమస్య :
టైప్ 2 డయాబెటిస్ సమస్య ప్రపంచమంతట చాలా త్వరగా వ్యాప్తి చెందుతోంది. ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం జరగకపోవడంతో ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్య వస్తుంది. ప్రతి రోజూ కాఫీను తీసుకోవడం వల్ల ఈ సమస్య కూడా తొలగిపోతుంది.
అల్జీమర్స్ :
కాఫీ తాగడం వల్ల ఈ సమస్య రాకుండా కాపాడుకోవచ్చు. అల్జీమర్స్ ఒక న్యూరో డీజనరేటివ్ డిసీజ్, ప్రపంచంలో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఎవరైతే కాఫీ తాగుతారో వారిలో 65 శాతం మంది అల్జీమర్స్ వ్యాధి రాకుండా కాపాడుకోగలిగారు. కాబట్టి ప్రతి రోజూ సరైన మోతాదులో కాఫీ తాగండి ఆరోగ్యంగా ఉండండి.