సాధారణంగా మనకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే దాని తాలూకు లక్షణాలు మనకు మూత్రంలో కనిపిస్తాయి. అందుకనే డాక్టర్లు చాలా సందర్భాల్లో మూత్ర పరీక్షలు జరుపుతుంటారు. తరువాతే వ్యాధిని నిర్దారించి చికిత్స అందిస్తారు. అయితే మూత్రంలో కొందరికి నురుగు వస్తుంటుంది.
3 వ్యాధులు ముఖ్య కారణాలు.. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. శరీరంలో ఎప్పటికప్పుడు ఏర్పడే వ్యర్థాలను బయటకు పంపించేందుకు కిడ్నీలు ఎప్పటికప్పుడు శ్రమిస్తుంటాయి. ఈ క్రమంలో కిడ్నీల పనితీరు మందగించినప్పుడు లేదా కిడ్నీలు ఫెయిల్ అవ్వడానికి ముందు మూత్రంలో మనకు నురుగు కనిపిస్తుంది.
- మూత్రంలో నురుగు వస్తుందంటే డయాబెటిస్ కూడా అందుకు కారణం కావచ్చు. డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో షుగర్ లెవల్స్ అధికంగా ఉంటాయి. అందువల్ల మూత్రంలో గ్లూకోజ్ ఎక్కువగా వస్తుంటుంది. దీని వల్ల మూత్రంలో నురుగు ఏర్పడుతుంది.
- కిడ్నీలు లేదా మూత్రాశయ ఇన్‌ఫెక్షన్ వచ్చినా మూత్రంలో నురుగు కనిపిస్తుంది. కనుక ఎవరికైనా సరే మూత్రంలో నురుగు వస్తుందంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి నిర్దారణ అయితే ఆ మేరకు డాక్టర్ సూచించిన మందులను వాడాలి. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.