నిద్రలో ఉన్నప్పుడు మనుషులు వింత వింతగా బిహేవ్ చేస్తారు. కొందరు ఘోరంగా గురకపెడతారు, కొందరు పిచ్చి పిచ్చి కలలు కని వాటి వల్ల భయపడతారు, కొందరు నవ్వుతారు, కొందరు నిద్రలోనే నడుస్తారు. ఇంకొందరు నిద్రలో ఏవేవో మాట్లాడతారు, అరుస్తారు. ఇవన్నీ ఏదో ఒకరోజు జరిగితే లైట్‌తీసుకోవచ్చు. కానీ తరచూ నిద్రలో మాట్లాడుతున్నారంటే.. మీ ఆరోగ్యం గాడి తప్పిందని అర్థం. నిద్రలో మాట్లాడటానికి కొన్ని కారణాలు ఉంటాయట. నిద్రలో మాట్లాడటాన్ని పారాసోమ్నియా అంటారు. పారాసోమ్నియాతో బాధపడేవారు నిద్రలో ఎక్కువగా మాట్లాడతారు. మరికొందరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. నేడు చాలా మంది ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. కాబట్టి నిద్రలో మాట్లాడే సమస్య ఎలా మొదలవుతుంది, దానికి అసలు ఏంటి కారణాలు ఇవి తెలుసుకుందాం
అలసట :
నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి అనేక వ్యాధులకు కారణమవుతుంది. రోజంతా పని టెన్షన్, దాని వల్ల అలసట వల్ల నిద్ర సరిగా పట్టలేదు. అలసట, నిద్ర దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. చాలా మంది బాగా అలసిపోయి నిద్రపట్టక నిద్రలో కూడా మాట్లాడతారు.
డిప్రెషన్ :
డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తులు కూడా సరిగా నిద్రపోలేరు. నిద్రలో కూడా డిప్రెషన్ గురించి ఆందోళన చెందుతారు. నిద్రపోయినా నిద్రలో కూడా అదే కలను కంటారు. డిప్రెషన్‌తో బాధపడేవారిలో కూడా ఒకరకమైన భయం ఉంటుంది. భయం వల్ల నిద్రలో కూడా మాట్లాడతారు
నిద్ర లేకపోవడం :
పిల్లలు 12 నుండి 14 గంటలు నిద్రపోవాలి. పెద్దలకు 7-8 గంటల నిద్ర అవసరం. వారి వయసుకు తగ్గట్టుగా నిద్రలేకపోతే స్లీప్ టాకింగ్ సమస్యలు మొదలవుతాయి.
జ్వరం :
శరీర ఆరోగ్యంలో తేడా వచ్చినప్పుడు మరియు జ్వరంతో బాధపడేవారు నిద్రలో మాట్లాడతారు. మానసికంగా రిలాక్స్‌గా, శారీరకంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నప్పుడే మనిషి బాగా నిద్రపోతాడు.
మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఎలాంటి సమస్యలు వచ్చినా సానుకూల ఆలోచనతో వాటిని అధిగమించవచ్చు. కాబట్టి పారాసోమ్నియా నుండి బయటపడటానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి.
పారాసోమ్నియాలను వదిలించుకునే మార్గాలు..
• బాగా నిద్రించడానికి ప్రయత్నించండి
• ఒత్తిడి, ఆందోళనను నివారించండి
• వీలైనంత వరకు డిప్రెషన్ నుంచి బయటపడటానికి ప్రయత్నించండి. దాని గురించి ఎక్కువగా చింతించకండి.
• సానుకూల ఆలోచనతో అనారోగ్యాలు వేగంగా నయమవుతాయి. కాబట్టి వీలైనంత సానుకూలంగా ఆలోచించండి.
• యోగా, ధ్యానాలు అనేక వ్యాధులకు దివ్యౌషధం. ఇది డిప్రెషన్, అలసట, శరీర నొప్పి మరియు చిన్న చిన్న సమస్యల నుండి ఉపశమనం పొందుతుంది. యోగా, ధ్యానం పారాసోమ్నియాను అధిగమించడానికి ఉపయోగపడతాయి.
• కొంతమంది ఏమీ చేయకుండా మరియు అభిరుచులను పెంచుకుంటూ సమయాన్ని వృధా చేసుకుంటారు. దీని కారణంగా, వారు శారీరక శ్రమను కోల్పోతారు. ఒంటరితనం కూడా వారిని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మనకు నచ్చిన ఏదైనా పనిలో నిమగ్నమైతే మానసిక ప్రశాంతత పెరిగి మంచి నిద్ర వస్తుంది.