శరీరంలో కిడ్నీల పాత్ర చాలా ముఖ్యం. డయాబెటిస్, హై బీపీ లాంటి వ్యాధుల కారణంగా కిడ్నీలపై ప్రభావం ఉంటుంది. కిడ్నీల పనితీరు మందగిస్తే.. శరీరం మొత్తానికి ప్రమాదం. కిడ్నీ పూర్తిగా పాడైతే బతకటం కష్టమే..కాబట్టి ప్రాథమిక దశలోనే కిడ్నీల సమస్యను గుర్తించి సరైన చికిత్స తీసుకోవాలి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోవచ్చు.
- మూత్రం రంగు మారినా, మూత్రంలో అసాధారణ మార్పులు కనిపించినా కిడ్నీ సమస్య ఉందని భావించాలి.
- కిడ్నీలు పాడయినప్పుడు అవి ఉండే భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది.
- ఆకలి లేకపోవడంతో బరువు తగ్గుతారు.
- కిడ్నీలు తీవ్రంగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి తగ్గుతుంది.
- రక్తంలోని వ్యర్థాల కారణంగా వికారం, వాంతులు లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి.
- కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి ముఖం, కాళ్లు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి.
- ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది.
- ఆక్సిజన్ స్థాయులు తగ్గడం వల్ల శ్వాస సమస్యలు తలెత్తుతాయి.
- ఏ విషయంపైనా ఏకాగ్రత ఉంచలేకపోవడం, తలనొప్పి, జ్ఞాపకశక్తి తగ్గడం లాంటి సమస్యలు చుట్టుముడతాయి.
- కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారం తీసుకోవాలి..
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి తగినంత నీరు తాగాలి. శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురి కానివ్వొద్దు. రోజూ 7-8 గ్లాసుల నీళ్లు తాగాలి. నీటిని ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలకు హాని కలిగించే విషతుల్య పదార్థాలు శరీరం నుంచి తేలిగ్గా బయటకు వెళ్లిపోతాయి.
వెల్లుల్లితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. కిడ్నీల నుంచి అనవసర వ్యర్థాలు బయటకు వెళ్లేలా వెల్లులి తోడ్పడుతుంది. వీటిని పచ్చిగా లేదంటే వంటల్లో భాగంగా తిన్నా ఫలితం ఉంటుంది.
ఆపిల్ పండ్లను తినడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. వీటిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
పుట్టగొడుగుల్లో ఉండే విటమిన్-బి, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. కిడ్నీ జబ్బులను దూరం చేస్తాయి. రకరకాల పుట్టగొడుగుల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. వీటి వల్ల రోగ నిరోధక వ్యవస్థ మెరుగవుతుంది.
కాలిఫ్లవర్‌లో ఉండే సల్ఫర్, పొటాషియం శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతాయి. ఫలితంగా కిడ్నీల పని తీరు మెరుగవుతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను మీకు అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే