వీటితో చెడు కొలెస్ట్రాల్‌కు చెక్‌ పెట్టేద్దామా..!

-

బాడీలో కొలెస్ట్రాల్‌ ఉండాలి కానీ అది మంచిదై ఉండాలి.. బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ పేరుకుపోతే.. రోగాలు గుట్ట పెరిగినట్లే.. చెడు కొలెస్ట్రాల్‌ను ఆదిలోనే అంతం చేస్తే తర్వాత ఎలాంటి సమస్యా ఉండదు. మనం ఇప్పటికే ఏం తింటే మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది.. ఏం తింటే బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది అని చెప్పుకున్నాం..వాటితో పాటు వీటిని కూడా. చూడండి. వీటిని మీ డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టొచ్చు..

ఓట్స్ ఆరోగ్యకరం..

చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి ఓట్స్ కూడా మంచి ఎంపిక. ఓట్స్‌లో ఉండే ఫైబర్, బీటా గ్లూకాన్ మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. ఇది పేగును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. రెగ్యులర్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్‌ని తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ స్థాయిని 6 శాతం తగ్గించవచ్చు.

ఆలివ్ నూనె..

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడానికి ఆలివ్ ఆయిల్ బాగా పనికొస్తుంది.. ఆలివ్ నూనె ఇతర నూనెలతో పోలిస్తే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని 8 శాతం వరకు తగ్గిస్తుంది. దాని ద్వారా మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది.

చేపలు..

చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి చేపలు తినొచ్చు… చేపలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. ఆరోగ్యంగా ఉండటానికి, వారానికి రెండు మూడు సార్లు ఆవిరి లేదా కాల్చిన చేపలను తినండి. మీకు చేపలంటే ఇష్టమైతే ఈ ఎంపిక ఉత్తమం. ఎంజాయ్‌ చేస్తూ ఆరోగ్యాన్ని మేలు చేసేవి తినొచ్చు.

అవిసె గింజలు..

చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి అవిసె గింజలు చాలా బాగా పనికొస్తాయి. అవిసె గింజలను క్రమం తప్పకుండా తీసుకుంటే, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. అవిసె గింజల వల్ల ఆడవారికి నెలసరి సమయంలో వచ్చే నొప్పులు కూడా ఉండవు. జట్టు రాలే సమస్య ఉన్నవారు అవిసెగింజలు వాడితే సమస్య తగ్గుతుంది. గుండెకు అవిసె గింజలు చాలా మేలు చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటే..గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి.. కాబట్టి ఫ్యాట్‌ టెస్ట్‌ చేయించుకుని దానికి తగ్గట్టు డైట్‌ ప్లాన్‌ చేసుకోవడం ఆరోగ్యవంతుల లక్షణం అంటున్నారు వైద్యులు. మనం సన్నగా ఉన్నాంలే.. అసలు బలమే లేదు ఇంక కొవ్వు ఎక్కడ ఉంటుంది అని అనుకుంటే పొరపాటే..పరీక్షలు చేయించుకుంటే కానీ తెలియదు అసలు నిజమేంటో..!

Read more RELATED
Recommended to you

Exit mobile version