ఇక నుండి 24×7 కరోనా వాక్సిన్…!

-

ఇప్పుడు వ్యాక్సిన్ కనుక వేయించుకోవాలి అంటే సరిగ్గా ఇదే సమయానికి వేయించుకోవాలని ఏమీ లేదు. హాస్పిటల్ సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకునే వాళ్లు సమయాన్నిబట్టి షెడ్యూల్ ని మార్చడానికి అవకాశం ఉంది అని ప్రభుత్వం చెప్పింది. దీంతో వాక్సినేషన్ డ్రైవ్ కూడా స్పీడ్ గా అవుతుంది. వాక్సినేషన్ వేగాన్ని పెంచడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో ప్రజలు ఎప్పుడైనా వ్యాక్సిన్ ని వేయించుకోవచ్చు. 24×7 ఇక అందుబాటు లో ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ సమయాన్ని, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

హెల్త్ మినిస్టర్ హర్ష వర్ధన్ తాజాగా ఒక న్యూస్ పేపర్ ట్వీట్ కి రిప్లై ఇచ్చారు. ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆసుపత్రులు అన్నీ కూడా గవర్నమెంట్ CoWIN ఆప్ మరియు వెబ్ సైట్ కి లింక్ అయ్యి ఉన్నాయి. వ్యాక్సిన్ ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో వేయించుకున్న కూడా సరైన షెడ్యూల్ చేసుకోవచ్చు అని చెప్పారు. ప్రభుత్వం మంగళవారం నాడు ఈ నిర్ణయం తీసుకుంది మరియు మూడు విభాగాల కింద ఎంపానెల్ చేయబడిన ప్రైవేట్ వైద్య సదుపాయాలు వాంఛనీయ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్రాలని మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది.

రాష్ట్రాలు మరియు యూనియన్ టెర్రిటరీస్ కూడా కోవిద్ వాక్సిన్ ని స్టోర్ చేయకుండా మరియు ఎక్కువ నిల్వ ఉంచకుండా ఉండాలని అన్నారు. ఒకసారి సెకండ్ ఫేస్ స్టార్ట్ అయిన తర్వాత 60 ఏళ్లు పైబడిన వాళ్ళకి మరియు 45 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ ఉంటుందని అన్నారు. కేంద్రం కూడా వ్యాక్సిన్ కొరత లేదని చెప్పింది. అందరికీ సరిపడా వ్యాక్సిన్ ఉన్నట్టు కూడా కేంద్రం చెప్పింది.

ఇలా రాష్ట్రాల్లో మరియు యూనియన్ టెర్రిటరీస్ లో ఉన్న ప్రజలందరికీ వాక్సినేషన్ జరుగుతుందని అంది. ఈ వాక్సినేషన్ ని ప్లాన్ చేసి అన్నీ హాస్పటల్స్ కి ప్రభుత్వంతో పాటు ప్రైవేటు ఆసుపత్రులకు కూడా తగిన విధంగా వ్యాక్సిన్లను కేటాయించాలని కూడా అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news