బీరకాయ అంటే.. ఎవరైనా ఇష్టంగానే తింటారు. దీని కాస్ట్ కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చిన చిక్కు మాత్రం లేతవి చూసుకుని తీసుకోవడం. అదేంటో బీరకాయలు ఎప్పుడు తీసుకున్నా బాగా ముదిరిపోయినవే వస్తాయి. ఎంత వెజిటెబుల్స్ కొనడంలో ఎక్సపర్ట్ అయినా బీరకాయల విషయానికి వచ్చే సరికి బోల్తాపడతారు. అయితే లేతగా ఉంటే కర్రీ, ముదిరిపోతే చట్నీ ఇలా ఏదో ఒక తీరు మనం వాటిని వాడుకోవచ్చు. శరీరానికి కావల్సిన విటమిన్లు, మినరల్స్ ఎన్నో బీరకాయల్లో ఉంటాయి. బీరకాయలో కొవ్వు, కొలెస్ట్రాల్ , కేలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి బీరకాయ బాగా హెల్ప్ చేస్తుంది.
బీరకాయ వల్ల బరువు తగ్గొచ్చు..
బీరకాయలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి బాగా ఉపకరిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులో విటమిన్ సి, జింక్, రిబోఫ్లేవిన్, మెగ్నీషియం, థియామిన్ వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. సెల్యులోజ్ మలబద్ధకాన్ని నివారించటంలో సహాయపడుతుంది. కంటి ఆరోగ్యాన్ని కాపడుకునేందుకు ఇందులో ఉండే బీటా కెరోటిన్ మేలు చేస్తుంది. ఆకలి నియంత్రణలో ఉంచుతుంది.
డయాబెటిస్ పేషెంట్స్ తినొచ్చా..
బీరకాయల్లో శరీరానికి కావల్సిన పెప్టైడ్స్, ఆల్కలాయిడ్స్ అధికంగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి బీరకాయలు ఎంతో ఉపయోగపడతాయి. ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయకారిగా పనిచేయటం వల్ల షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుంది. తద్వారా అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
కామెర్లు వచ్చినవారు తింటే..
కామెర్ల వంటి సమస్యలు వచ్చి వారికి బీరకాయను ఆహారంగా తీసుకోవటం వల్ల మంచి మేలు కలుగుతుంది. లివర్‌ను శుభ్ర పరుస్తాయి. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను నివారిస్తుంది. బీరకాయ అమ్లత్వాన్ని తగ్గించి.. వేడిని తొలగిస్తుంది. మూత్రవిసర్జన సాఫీగా సాగేలే చేస్తుంది. అల్సర్ల సమస్య ఉన్నవారు బీరకాయను ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచటంలో సహాయకారిగా పనిచేస్తుంది.
వామ్మో బీరకాయ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..! మీలో ఎవరికైనా ఇష్టం లేకపోతే అర్జెంట్‌గా తినడం స్టాట్ చేసేయండి మరీ.. అసలు బీరకాయలో పాలు పోసి వండితే ఉంటుంది.. ఆహా నెక్ట్స్ లెవల్ అంతే..! ఏ సీజన్‌లో అయినా చవక్కా వచ్చే కూరగాయ కాబట్టి వారానికి ఒకసారి అయినా తినడం మంచిది.!