Monkey pox: మంకీ పాక్స్ ఎలా వ్యాపిస్తుంది..? లక్షణాలు, నివారించేందుకు మార్గాలు ఇవే..!

-

Monkey pox: ఇప్పుడు అందరూ మంకీ పాక్స్ గురించి టెన్షన్ పడుతున్నారు. అయితే ఈ మంకీ పాక్స్ అంటే ఏంటి..? ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది..? ఇలా రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు వంటి విషయాలను చూద్దాం. మంకీ పాక్స్ అంటే ఏంటి..? ఇది ఒక అంటూ వ్యాధి లాంటిది. 1958 లో డెన్మార్క్ లో మొట్టమొదట ఈ వైరస్ ని కనుగొన్నారు. అసలు ఎలా వ్యాపించింది అనేది ఇప్పటికే తెలియలేదు. సెంట్రల్ వెస్ట్ ఆఫ్రికాలో ఎక్కువగా ఈ మంకీ పాక్స్ వ్యాపించింది. ప్రయాణం చేసి లేదా ఇంపోర్ట్ చేయబడిన జంతువుల నుండి ఇది వ్యాపించడం జరిగింది. 2022లో మంకీ పాక్స్ 70 దేశాలకు పైగా వ్యాపించింది.

అసలు ఇది ఎలా వ్యాపిస్తుంది..?

పగిలిపోయిన చర్మం, రెస్పిరేటరీ సిస్టం ద్వారా ఇది వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి దగ్గర నుండి మరొక వ్యక్తికి స్కిన్ టు స్కిన్ లేదా సెక్స్, కిస్సింగ్, మసాజ్ వంటి పద్ధతులు ద్వారా ఇది వ్యాపిస్తుంది. ఈ వైరస్ ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉండడం వలన ఇతరులకు ఇది వ్యాపిస్తుంది.
గర్భిణీలు ఈ వైరస్ బారిన పడితే కడుపులో ఉన్న బిడ్డకి కూడా సోకుతుంది.
ఇన్ఫెక్ట్ అయిన జంతువుల నుండి ఇది వ్యాపించవచ్చు. జంతువులు కరిచినా లేదంటే అవి గీరినా సరే ఎఫెక్ట్ అవుతుంది.

మంకీ పాక్స్ లక్షణాలు:

ర్యాషెస్ ప్రథమ లక్షణం. ఇవి చాలా నొప్పిగా అనిపిస్తాయి. దురద కలుగుతుంది. ముందు ఒక కురుపులు వచ్చి తర్వాత చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. సెక్స్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్స్, మల్టిపుల్స్ సెక్స్ పార్ట్నర్స్ కలిగిన వారికి కూడా ఈ వైరస్ వ్యాపించవచ్చు. ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఈ సమస్య ఉన్న వాళ్ళతో సెక్స్ లో పాల్గొనడం, వారిని ముట్టుకోవడం వంటివి చేయకూడదు. ఈ సమస్య వచ్చిన మూడు నుండి నాలుగు వారాలకి రికవరీ అయిపోవచ్చు. వ్యాక్సిన్ వేయించుకోవడం వలన కూడా రిస్క్ తగ్గుతుంది. ఈ సమస్య ఉన్న వాళ్ళ ప్లేట్లు, తువ్వాలు, దుప్పట్లు వంటివి షేర్ చేసుకోవడం మంచిది కాదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version