రుణమాఫీ పై రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్..!

-

తెలంగాణలో ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. మూడో విడుత రూ.2లక్షల వరకు నిన్న రుణమాఫీ నిధులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే రుణమాఫీ పైన CM రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. నువ్వు చేసిన రుణమాఫీ నిజమైతే.. నీ నియోజకవర్గానికే మీడియాతో కలిసి వెళ్దాం. ఒక్క రైతు వేదికలో వంద శాతం రుణమాఫీ జరిగిందని ఒక్క రైతు చెప్పిన నేను రాజకీయాలను వదిలేస్తా. సీఎంకు దమ్ముంటే నా సవాల్ స్వీకరించాలని ఛాలెంజ్ చేస్తున్నా అని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో 1,72,433 మంది రైతులు రుణం తీసుకుంటే మూడు విడుతల్లో కలిపి 71 వేల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యింది. అంటే లక్ష మందికి రుణ మాఫీ కాలేదు. అలాగే  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంత జిల్లా ఖమ్మంలో 3,73,157 మంది రైతులు రుణం తీసుకుంటే.. 1,15,600 మంది రైతులకే రుణమాఫీ అయ్యింది. అంటే కేవలం 30% మంది రైతులకే రుణమాఫీ జరిగింది అని తెలిపారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version