వర్షాకాలం ప్రకృతి అందాలతో కనివిందు చేస్తుంది. కానీ ఈ సీజన్లో పిల్లలకు అనేక ఆరోగ్య సమస్యలను కూడా తీసుకువస్తుంది. వాతావరణం లో తేమ పెరగడం కలుషితమైన నీరు, దోమల కారణంగా వర్షాకాలంలో పిల్లలకు,పెద్దలకు వ్యాధులు చుట్టుముడతాయి. ముఖ్యంగా పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకే వారి త్వరగా వ్యాధుల బారిన పడుతుంటారు.
ప్రస్తుతం గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర,పూణే,తెలంగాణ, వంటి రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వ్యాధులు ప్రబలుతున్నాయని ముఖ్యంగా ఆసుపత్రిలో పెద్దలతో పాటు పిల్లలు కూడా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ బారినపడి, టైఫాయిడ్, కామెర్లు, అతిసారం వంటి వ్యాధులతో హాస్పటల్లో చేరుతున్నట్లు వైద్యులు నివేదించారు.
ఈరోజు వర్షాకాలంలో పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ దాదాపు 40% పెరిగినట్టు పూణేలోని సూర్య మదర్ అండ్ చైల్డ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ పీడియాట్రిక్ హెడ్, రోహిణి నాగర్కర్ తెలిపారు. ఈ భారీ వర్షాల సమయంలో మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచిస్తున్నారు.
వర్షాకాలంలో ఎక్కువగా నీరు నిలిచిపోవడం,మురికి నీరు రోడ్లపై పారడం, తాగునీరు కూడా కలుషితం అవడం వల్ల వ్యాధులు ప్రబలుతాయని, నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా కలర,టైఫాయిడ్,మలేరియా,హెపటైటిస్ A వంటి వ్యాధులు, నిల్వ ఉన్న నీరుతో అపరిశుభ్రమైన వాతావరణంతో ఇలాంటి వ్యాధులు త్వరగా పిల్లలకు వ్యాపిస్తున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పిల్లల్లో జలుబు, దగ్గు, వైరల్ జ్వరాలు, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ప్రబలుతున్నాయి. కలుస్తమైన నీరు ఆహారం కారణంగా డయేరియా, టైఫాయిడ్ కామెర్లు వంటి జీర్ణ శ్వాస సంబంధిత వ్యాధులు ప్రబలుతున్నాయి. మంచినీటి సరఫరా లో మురుగునీరు కలవడం వల్ల ఈ సమస్యలు మరింత తీవ్రతరం అవుతున్నాయి.
నిలిచిపోయిన వర్షపు నీరు దోమల వలన డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఈ వర్షాకాలంలో తడి దుస్తులు, వాతావరణం తేమగా ఉండడంతో తడిచిన చెప్పులు ధరించడం వల్ల గజ్జి తామర వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు చర్మ సమస్యలు కూడా పిల్లల్లో కలుగుతున్నాయి.
వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్యా సమస్యలు మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలతోనే నివారించవచ్చు. ముఖ్యంగా నీటిని మరిగించి తాగడం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం వీధిలో దొరికే ఆహారాన్ని నివారించడం, పిల్లలకు టీకాలు వేయించడం తో ఎక్కువ గా ఉన్న ప్రమాదాన్ని కొంత నివారించవచ్చు అని డాక్టర్స్ సూచిస్తున్నారు.