కర్భూజా పండు యొక్క ఉపయోగాలు…!

-

వేసవిలో విరివిగా లభించే పండ్ల రకాలలో కర్భూజా పండు ఒకటి.  ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కర్భూజాలో విటమిన్ ఎ సమృద్దిగా ఉంటుంది.ఇది తిన్నవారికి మల మూత్ర విసర్జన చక్కగా జరుగుతుంది.ఇంకా ఇది అనేక రకాల వ్యాధులకు నివారణగా ఉపయోగపడుతుంది.కర్భుజా విటమిన్ ఎ లోపం వల్ల కలిగే వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ పండు మూత్రాశయ, మూత్రపిండాల వ్యాధులు, మల బద్ధకం అంతరిస్తుంది.

ఈ పండు సేవించేవారికి గుండె కండరాలు దృఢంగా, బలిష్టంగా ఉంటాయి. కర్భూజా పండులో ఉప్పు, మిరియాలపొడి చల్లి సేవిస్తే మంచి ఆరోగ్యం చేకూరుతుంది. చర్మం దురదగా ఉన్నవారు కర్భూజా గుజ్జును తింటే చర్మ వ్యాధులు నశిస్తాయి. కర్భూజ పండు పై తోలును కాల్చి మసిచేసి దానితో కషాయం తయారు చేసి దానిలో లేత కొబ్బరి నీరుకలిపి సేవిస్తే మూత్ర పిండాల్లో రాళ్ళు విసర్జింపబడతాయి.

కర్భూజ ఆరోగ్యానికి మాత్రమే కాక సౌందర్య సాధనంగా కూడా పని చేస్తుంది. కర్భూజా పండు తోలుని మెత్తగా నూరి ముఖానికి అప్లై చేస్తే ముఖం మీద ముడతలు పోయి నిగనిగలాడుతుంది. దీని గింజలు నూరి రాసినా ముఖం మీద మొటిమలు పోయి మృదువుగా మారి కాంతివంతంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news