అసలే కరోనా వ్యవహారం తో  అల్లల్లాడుతున్న ట్రంప్ నెత్తిన మరొక పిడుగు !

-

అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ వల్ల విలవిల్లాడిపోతోంది. ప్రపంచ దేశాలను గజగజలాడించిన అమెరికా ఒక చిన్న వైరస్ కి ప్రస్తుతం భారీ మూల్యం చెల్లించు కుంటుంది. ప్రారంభంలో ఈ వైరస్ వచ్చిన టైం లో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చాలా నవ్వులాటగా తీసుకున్నారు. ఆ తర్వాత ఈ వైరస్ ప్రభావం గట్టిగా అమెరికాలో ఉండటంతో వ్యాక్సిన్ వచ్చేస్తుందని కంగారు పడనవసరం లేదు అని తెలిపారు. అయితే ఇప్పటికీ వ్యాక్సిన్ కనుగొన లేక పోవడంతో అమెరికాలో లక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా, మరోపక్క వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో అధ్యక్షుడు ట్రంప్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మరోపక్క ఇదే సంవత్సరం అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కరోనా వ్యవహారం ట్రంప్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.Trump's deadly sanctions power should be reined in | Trump | Al ...పూర్తి మేటర్ లోకి వెళ్తే డెమోక్రటిక్ పార్టీ నుండి దూసుకుపోతున్నారు బిడెన్ అనే వ్యక్తి. ఇటీవల తనతో పోటీగా పార్టీలో ఉన్నా సాండర్స్ నీ సైతం వెనక్కి నెట్టి ముందు వరుసలో బిడెన్ నిలిచారు. డెమోక్రటిక్ పార్టీ నుంచి బిడెన్ కి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైందని అంటున్నారు నిపుణులు. అయితే ఈ దూకుడు ట్రంప్ పై కూడా ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదని. ఇప్పటికే బిడెన్ కి వస్తున్న ప్రజా మద్దతు చూస్తుంటే ట్రంప్ కి చెమటలు పడుతున్నాయని అమెరికాలో వార్తలు వినబడుతున్నాయి.

 

ముఖ్యంగా కరోనా వైరస్ విషయంలో డోనాల్డ్ ట్రంప్ వ్యవహరించిన తీరును ఎండగడుతూ బిడెన్ చేస్తున్న వ్యాఖ్యలు ట్రంప్ నెత్తిన మరొక పిడుగు పడుతున్నట్లు ఉన్నాయని అమెరికా మీడియా వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ‘అమెరికా గ్రేట్ ఎగైన్’ స్లోగన్ తో గత అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డోనాల్డ్ ట్రంప్.. తన మొండితనంతో కరోనా వైరస్ కి అమెరికన్లను బలి తీసుకుంటున్నట్లు డెమోక్రటిక్ పార్టీ సభ్యులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news