Norovirus : హైదరాబాద్లో కలకలం సృష్టిస్తున్న నోరో వైరస్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

-

Norovirus : గతంలో కరోనా వైరస్ ఏ విధంగా ప్రపంచాన్ని విధ్వంసం చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల కుటుంబాన్ని బలి చేసింది. మన దేశంలో కరోనా సృష్టించిన అలజడి, మోగించిన మరణ మృదంగం ఇప్పటికీ కూడా వెన్నులో వణుకు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే.

Norovirus

ఇప్పుడు హైదరాబాద్ లో తాజాగా కొత్త వైరస్ ఒకటి వ్యాపిస్తోందని, ప్రజలు కచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. నొరో వైరస్ హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించింది. రోజుకు ఏకంగా 100 నుంచి 120 దాకా కేసులు నమోదవుతున్నాయని GHMC తెలిపింది. అందుకే నగరంలో ఉన్నవారంతా కూడా కచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ X వేదికగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. పైగా ఇది వర్షా కాలం.అనేక వ్యాధులు ఈ కాలంలోనే ఎక్కువగా వస్తాయి.

ఇది సీజనల్ వ్యాధులు ఈజీగా వ్యాపించే కాలం కావడంతో కచ్చితంగా చాలా జాగ్రత్తలు పాటించాలని GHMC సూచించింది.ఈ కాలంలో కచ్చితంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు చాలా అంటే చాలా సులభంగా వ్యాపిస్తాయి. ఇప్పుడు వీటికి తోడు నొరో వైరస్ కూడా రావడం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. కలుషితమైన ఆహారం, నీటి ద్వారానే ఈ వైరస్ వ్యాపిస్తుందని డాక్టర్లు కూడా చెబుతున్నారు. ఈ వైరస్ బారిన పడినవారిలో 48 గంటల్లోనే వాంతులు, విరేచనాలు, చలి-జ్వరం, నీరసం, డీహైడ్రేషన్ ఇంకా కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్లు తెలిపారు.

ముఖ్యంగా మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఈ వైరస్ చాలా త్వరగా సోకే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరించడం జరిగింది.ఇక ఈ నొరో వైరస్ కట్టడికి ప్రస్తుతం వ్యాక్సిన్, మెడిసిన్ కూడా లేదట. కాబట్టి ఇది రాకుండా ముందు జాగ్రత్తగా ఉండటమే మార్గం అంటున్నారు డాక్టర్లు. ఇక డాక్టర్లు సూచించిన జాగ్రత్తలు కచ్చితంగా పాటిస్తూ.. వాళ్లు ఇచ్చిన మెడిసిన్ వేసుకోవాలని తప్పనిసరిగా వేసుకోవాలని జీహెచ్ఎంసీ సూచించింది. అలాగే ఇంట్లో కాచి, చల్లార్చి, వడపోసిన నీటినే తాగాలని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలని తెలిపింది. ఇంకా అలాగే ఇంటిని కచ్చితంగా క్రిమిసంహారక మందులతో శుభ్రం చేసుకోవాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version