కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్యకు గురయ్యాడు. బెంగళూరులోని HSR లేఔట్‌లో ఉంటున్న మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్యకు గురయ్యాడు. అయితే ఈ సంఘటన నేపథ్యంలో కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ భార్యపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఆ దిశగా దర్యాప్తు హెస్తే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. మాజీ డీజీపీని కట్టేసి కొట్టి, కారం చల్లి చంపింది భార్యనే అని తేలింది.

భార్య చేతిలోనే కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హతమయ్యాడు. మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసు లో బయటపడ్డ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాల కారణంగా మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ ను హత్య చేసింది భార్య. హత్యకు ముందు ప్రకాశ్‌ను కట్టేసి, కారం చల్లి గాజు బాటిల్ తో పల్లవి కొట్టిందని తెలిపారు పోలీసులు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.