ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతున్నారా..? మెదడుపై చెడు ప్రభావం పడుతుందట

-

ఒకప్పుడు అందరితో కలిసి ఉండటం, గ్రూప్‌గా ట్రిప్స్‌ ప్లాన్‌ చేయడం అంటే ఇష్టపడిన వాళ్లు.. ఎప్పుడు ఎంత వీలైతే అంత ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఒంటరిగా ఉండటం అంటే వాళ్లకు అదే పెద్ద సంతోషం అన్నట్లు తయారయ్యారు. ఎవర్ని కలవకుండా, ఎటూ వెళ్లకుండా రోజంతా ఇంట్లోనే ఉన్నా కొంచెం కూడా బోర్‌ ఫీల్‌ అవ్వరు. కానీ ఇలా మీరు ఉంటున్నారు అంటే.. మీ మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది అని నిపుణులు చెబుతున్నారు. మెదడుపై చెడు ప్రభావం చూపుతాయని అధ్యయనాలు రుజువు చేశాయి.

హార్వర్డ్ మెడికల్ స్కూల్, UN నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్ వంటి సంస్థల నివేదికలు ఈ దిగ్భ్రాంతికరమైన పరిణామాలను పరిశోధించాయి మరియు మెదడుకు సమస్యలను కలిగించే కొన్ని అలవాట్లు మంచివి కావని అక్కడి మనస్తత్వవేత్తలు అంటున్నారు. ఒంటరిగా గడపడం, హెడ్‌ఫోన్స్‌తో ఎక్కువ సమయం గడపడం, ఇంట్లోనే ఉండడం, చీకటి గదుల్లో ఉండడం మంచిది కాదు. వీటన్నింటికి తోడు సరిగా నిద్రపోకపోవడం, మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడటం ప్రమాదకరమని అంటున్నారు.

మన మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఇతరులతో మాట్లాడటం చాలా ముఖ్యమని సర్వే నివేదికలు చెబుతున్నాయి. నిత్యం ఒంటరిగా ఉండటంతోపాటు నిద్రలేమి మెదడును దెబ్బతీస్తుంది. కాబట్టి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో వీలైనంత ఎక్కువ సమయం గడపడం కూడా మీ ఆరోగ్యానికి మంచిది. ఈ ఒంటరితనం వల్ల డిప్రెషన్, యాంగ్జయిటీ, డిమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కుటుంబం లేదా స్నేహితులతో తగినంత సమయం గడపండి, నిపుణులు అంటున్నారు.

మనం ఒంటరిగా ఉన్నప్పుడు కంటే.. నలుగురితో కలిసి ఉన్నప్పుడే మెదడు షార్ప్‌గా పనిచేస్తుందట. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వల్ల చాలా మంది ఒకరకమైన డిప్రషన్‌లోకి వెళుతున్నారు. ఆఫీస్‌కు వెళ్తే.. పనితో పాటు ఫన్‌ ఉంటుంది. కబుర్లు చెప్పుకోవచ్చు, గాసిప్స్‌ వినొచ్చు. మెదడుకు ఇవన్నీ ఎంటర్‌టైమన్మెంట్‌. కానీ ఇంట్లోనే ఉండటం వల్ల కేవలం పని, ఆ ఇంట్లో నలుగురితోనే కమ్యునికేట్‌ అవుతారు. కొంతమంది ఇంట్లో వాళ్లతో కూడా సరిగ్గా మాట్లాడరు. తెలియకుండా వాళ్లలో ఒక సైకో డవలప్‌ అవుతుంటారు. దేనికి పెద్దగా ఫీల్‌ అవరు.. వాళ్లకు ఏ విషయం అంత హ్యాపీని ఇవ్వదు. మీరు ఈ స్టేజ్‌లో ఉంటే వెంటనే మీ లైఫ్‌స్టైల్‌ మార్చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news