ఈరోజుల్లో స్త్రీలు ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు..అందులోను నెలసరి సమస్యలతో బాధపడుతుంటారు.. చాలా మంది అమ్మాయిలకు నెలసరి క్రమంగా రావడం లేదు..కొంతమందికి రెండు నెలలకొకసారి నెలసరి రావడం, అలాగే రక్తస్రావం కనీసం 5 రోజుల పాటు కాకపోవడం వంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందనే చెప్పవచ్చు.. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
సాధారణంగా నెలసరి 21 రోజుల నుండి 40 రోజుల మధ్యలో వస్తుంది. అలాగే 5 నుండి 7 రోజుల పాటు రక్తస్రావం అవుతుంది. అయితే నేటి తరుణంలో నెలసరి సక్రమంగా రాకపోవడంతో పాటు రక్తస్రావం కూడా తక్కువగా అవుతుంది. నెలసరి సక్రమంగా రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి.. సరైన ఆహార పద్ధతులను పాటించకపోవడం జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, అధిక బరువు, థైరాయిడ్, పిసిఒడి, హార్మోన్ల అసమతుల్యత వంటి వివిధ కారణాల చేత పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయి..ఈ సమస్య వల్ల చాలా మంది ఆడవాళ్లకు సంతానలేమి సమస్య కూడా ఎదురవుతుంది..సంతాన లేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సమస్యల నుండి బయటపడాలంటే చక్కటి పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. అధిక బరువు నుండి సాధ్యమైనంత త్వరగా బయటపడాలి. ప్రతిరోజూ వ్యాయామం, యోగా వంటివి చేయాలి. నీటిని ఎక్కువగా తాగాలి. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. జంకర్ ఫుడ్ కు వీలైనంత దూరంగా ఉండాలి. ఒత్తిడి, ఆందోళన వంటి వాటిని దరి చేరనీయకూడదు. ప్రతిరోజూ కనీసం 8 గంటల పాటు నిద్రపోవాలి. ఈ నియమాలను పాటిస్తూనే ఒక ఆయుర్వేద చిట్కాను పాటించడం వల్ల ప్రతినెల పీరియడ్స్ వస్తాయి.. ఆ చిట్కా ఏమిటో.. ఎలా చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర చెక్క నిమ్మరసం వేసి కలపాలి. తరువాత చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలపాలి. తరువాత ఇందులో ఒక టమాట నుండి తీసిన రసాన్ని వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని రోజూ రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా ఈ నీటిని తాగుతూనే కొద్దిగా బెల్లాన్ని తినాలి. ఇలా తీసుకోవడం వల్ల బహిష్టు ప్రతినెలా క్రమం తప్పకుండా వస్తుంది..ఈ చిట్కాను వాడిన రెండు, మూడు రోజులకే పీరియడ్స్ వస్తాయి.. ఒకసారి ట్రై చెయ్యండి..