‘నరేంద్ర మోదీ ఓ క్రై బేబీ’.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కామెంట్స్

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ క్రై బేబీ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడుస్తూ ఉండటం మోదీకి అలవాటని ధ్వజమెత్తారు.కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తనను ఇప్పటి వరకు 91 సార్లు దూషించారంటూ పదే పదే చెప్పుకొని తిరుగుతున్న ప్రధాని.. ఇప్పటి వరకు ప్రజల కష్టాలు ఏమిటనే విషయాన్ని అడిగిన పాపాన పోలేదని తప్పుపట్టారు. తమ అధినాయకిని ‘వితంతువు’, ‘ఇటలీ గర్ల్‌’ అని- రాహుల్‌ను ‘హైబ్రిడ్‌’, ‘పప్పు’ అని ఎన్నిసార్లు విమర్శించారో ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు.

తమను ఎవరు విమర్శించినా, మోదీ తరహాలో ఏడుస్తూ కూర్చోలేదని ఖర్గే అన్నారు. ఎన్నికలంటే యుద్ధమని భావించి, ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నామని చెప్పారు. తాను వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తినని ప్రతిసారీ మోదీ ఎందుకు చెప్పుకొంటున్నారని ప్రశ్నించారు. ‘నేను దళితుడిని. మోదీ కన్నా తక్కువ స్థాయిలో ఉన్నాను. మొదట నా తలపై కాళ్లు పెట్టిన తర్వాత, మిమ్మల్ని విమర్శించేందుకు వస్తారు అనే విషయాన్ని విస్మరించవద్దు’ అని ఖర్గే పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి మంత్రివర్గ సమావేశంలోనే తాము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుతామని హామీ ఇచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version