దానిమ్మ పండ్లలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. విటమిన్ సి, కె, ప్రోటీన్లు, ఫైబర్, ఫోలేట్, పొటాషియం తదితర ముఖ్యమైన పోషకాలు మనకు దానిమ్మపండ్ల వల్ల లభిస్తాయి. ప్రపంచంలో ఎంతో పురాతన కాలం నుంచి దానిమ్మ పండ్ల వినియోగం ఉందని, ఈ పండ్లను పలు అనారోగ్య సమస్యలను నయం చేసేందుకు కూడా వాడుతారని చరిత్ర చెబుతోంది. అయితే దానిమ్మ పండ్ల వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ వైరల్, యాంటీ ట్యూమర్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల ట్యూమర్లు రాకుండా చూస్తాయి. క్యాన్సర్‌ను అడ్డుకుంటాయి.
2. శరీర రోగ నిరోధక వ్యవస్థను దానిమ్మ పండ్లు పటిష్టం చేస్తాయి. చర్మం, వెంట్రుకలకు సంరక్షణనిస్తాయి. అనారోగ్య సమస్యలను త్వరగా నయం చేసేందుకు ఉపయోగపడతాయి.
3. దానిమ్మ పండ్లలో గ్రీన్ టీ, రెడ్ వైన్ కన్నా 3 రెట్లు ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని కణజాలాన్ని రక్షిస్తాయి.
4. గుండె జబ్బులు ఉన్నవారికి దానిమ్మ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ పండ్లను తింటే ఫలితం ఉంటుంది.
5. మధుమేహం, కొలెస్ట్రాల్, అధిక బరువు, హైబీపీ తగ్గాలంటే తరచూ దానిమ్మ పండ్లను తింటుండాలి. చిన్నారులకు దానిమ్మ పండ్లను తినిపిస్తుంటే వారిలో ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. మెదడు చురుగ్గా ఉంటుంది.
6. పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచే గుణాలు దానిమ్మ పండ్లలో ఉంటాయి. అలాగే స్త్రీలలో హార్మోన్ సమస్యలను దానిమ్మ పండ్లు తొలగిస్తాయి.