తల్లి అయిన తరువాత కెరీర్‌లోకి మళ్లీ ఎంటర్ అవ్వాలని అనుకుంటున్నారా? మీ కోసం ఈ స్మార్ట్ చిట్కాలు!

-

తల్లి కావడం ఒక అద్భుతమైన వరం. ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం. 9 నెలలు ఎంతో శ్రమించి బిడ్డకు జన్మనిచ్చిన తరువాత ఆ బిడ్డ ఏడుపు విని ఎంతో ఆనందపడతారు తల్లులు. వారు ఈ తొమ్మిది నెలలు కష్టపడిందంతా బిడ్డను చూసుకొని మరిచిపోతారు. ఆ బిడ్డతోనే హద్దులు లేని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు ఇప్పుడున్న బిజీ లైఫ్ లో భార్యాభర్త ఇద్దరు ఆఫీసులకు వెళ్లి పనులు చేసుకోక తప్పదు. మరి అలాంటప్పుడు తల్లి అయిన తర్వాత కెరియర్ పై ఫోకస్ పెట్టాలి. తిరిగి మళ్ళీ ఉద్యోగానికి వెళ్లాలి. సరైన ప్రణాళిక తో కొన్ని చిట్కాలతో మీరు తిరిగి మళ్లీ కొత్తగా ఉద్యోగంలోనికి వెళ్ళవచ్చు. తల్లి అయిన తర్వాత తన కెరియర్ లో తిరిగి రావడానికి సహాయపడే చిట్కాలను ఇప్పుడు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ప్రణాళికను సిద్ధం చేయడం : కెరియర్ లో తిరిగి రావడానికి ముందు మీరు ఏది సాధించాలనుకుంటున్నారో స్పష్టంగా నిర్ణయించుకోండి మీరు మీ పాత రంగంలోనే కొనసాగాలనుకుంటే, అక్కడి వారితో మాట్లాడి కొంత సమయం ఆఫీసులో, కొంత సమయం ఇంట్లో ఉద్యోగం చేసేలాగా, ప్రణాళికను సిద్ధం చేసుకోండి. బిడ్డ సంరక్షణ ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి రోజువారీ షెడ్యూల్ రూపొందించుకోవడం ఎంతో ముఖ్యం.

బేబీ కేర్ సొల్యూషన్స్ : మీరు పనిలో ఉన్నప్పుడు, మీ బిడ్డను చూసుకోవడానికి మీరు ఎంతో నమ్మకం ఉన్న మంచి బేబీ కేర్ సెంటర్లను ఎంచుకోవాలి. నమ్మకమైన బేబీ సిస్టర్స్ ని లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒక సహాయం తీసుకోవడం వలన, మీరు ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత బేబీ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన పని లేకుండా ఉంటుంది. ఇంట్లోనే బేబీ సంరక్షణ కి ఎవరైనా ఆయాని ఏర్పాటు చేసినప్పుడు, సీసీ కెమెరాలు ఉపయోగించడం మంచిది.

కొత్త ఉద్యోగ అవకాశాలు : మీ ఉద్యోగంలో పూర్తి సమయం కేటాయించకుండా, వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలను ఫ్రీలాన్సర్ ఉద్యోగాలను, లేదా పార్ట్ టైం జాబ్స్ ని ఎంచుకోవడం మంచిది. బిడ్డ సంరక్షణను ఇలాంటి పనులు సులభం చేస్తాయి ఈ రకమైన అవకాశాలు మీకు వస్తే అప్పుడు బేబీ సంరక్షణ ఈజీ అవుతుంది.

Ready to Return to Work After Motherhood? Here Are Some Smart Tips!

కుటుంబ సహకారం: తల్లి ఐన తరువాత మీరు తిరిగి  పని ప్రారంభించాలనుకున్నప్పుడు మీ బేబీని చూసుకోవడానికి మీ భాగస్వామిని లేదా తల్లిదండ్రులను, మీ ఇతర కుటుంబ సభ్యులు ఎవరైనా బాధ్యతను పంచుకోవడం కోసం సిద్ధంగా ఉన్నారా లేదా అని తెలుసుకోండి. కొంత సమయం మీ పాట్నర్,చూసుకునే విధంగా టైం మేనేజ్మెంట్ చేసుకుంటే ఇద్దరూ కలిసి పిల్లల్ని చూసుకోవచ్చు. కుటుంబ సభ్యుల తో కలిసి షెడ్యూల్ రూపొందించి మీ జీవిత భాగస్వామి ఉదయం బిడ్డని చూసుకుంటే మీరు సాయంత్రం చూసుకోడానికి వీలుగా షెడ్యూల్ రూపొందించుకోండి.

బిడ్డతో గడిపే సమయం: మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మీరు గడిపే ప్రతి క్షణం బేబీకి ఎంతో అమూల్యమైనది. ఇంటికి వచ్చిన తరువాత బేబీకి కావాల్సినవన్నీ సమకూర్చడం బేబీ తో ఆటలు, పాటలు కథలు చెప్పడం వంటివి సమయాన్ని మీ బిడ్డతో మీరు ఉన్న కొంచెం సమయం ఐన ఎంతో బలమైన బంధాన్ని ఏర్పరుస్తాయి.

బిడ్డ పుట్టిన తర్వాత ఉద్యోగంలోకి తిరిగి రావడానికి సవాళ్లు అనిపించవచ్చు కానీ సరైన ప్రణాళిక, కుటుంబ సభ్యుల సహకారంతో మీరు విజయవంతంగా ఈ రెండు పాత్రలను నిర్వహించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news