తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎవరైనా మా పార్టీలకి రావాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు. ఫిర్యాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తప్పకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మూడు నెలలోపు ఎమ్మెల్యేలను డిస్ క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు. డిస్ క్వాలిఫై చేయకపోతే స్పీకర్ పక్షపాతి అని సంకేతం ఇచ్చినట్లే అన్నారు.
భారతీయ జనతా పార్టీలోకి మొత్తం ఐదు మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు వస్తారని బాంబు పేల్చారు ఎన్ రామచంద్రరావు. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని.. తమతో టచ్ లో ఉన్నట్లు కూడా ఆయన వెల్లడించారు. అయితే ఆ ఎమ్మెల్యేలు ఎవరు అలాగే వారు పార్టీలో చేరే తేదీలను కూడా త్వరలో వెల్లడిస్తామని వివరించారు.