MLA Kolikapudi Srinivasa Rao: మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు. కొందరు 20 రోజులుగా నీళ్లు రావట్లేవు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. అలా ప్రచారం చేసే వాళ్లను చెప్పు తీసుకొని కొడతానంటూ హెచ్చరించారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు.

కలెక్టర్ పర్యవేక్షణలో యాప్ ద్వారా కొండూరు ప్రాంతంలో నీటిని సప్లై చేస్తుంటే చేయట్లేదు అని చెప్తున్నారు… అలాంటి వాళ్ళని చెప్పు తెగేదాకా కొడతా అని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు. ఇక దీనిపై జనాలు ఆగ్రహిస్తున్నారు.
ఇక అటు ఇటీవలే వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో పెద్దిరెడ్డిని కలిసి, మంతనాలు జరిపారు కొలికపూడి శ్రీనివాసరావు. టీడీపీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేతను కలవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.