ప్రతి ఒక్కరూ నిద్ర పోయినప్పుడు ఎన్నో కలలను ఎదుర్కొంటారు. ఇది అందరిలో సహజం అయినా కొంతమందికి కొన్ని రకాల కలలు వస్తూ ఉంటాయి. అయితే వాటి వెనక ఎన్నో సంకేతాలు కూడా ఉంటాయి అని నిపుణులు చెబుతున్నారు. స్వప్న శాస్త్రం ప్రకారం, ఎవరైతే కలలో వర్షం పడినట్టు అనుభూతిని పొందుతారో, దాని వెనుక కొన్ని అర్థాలు ఉన్నాయి. చాలా మంది నిద్రపోయినప్పుడు కలలు వచ్చినా సరే, వాటిని గుర్తుపెట్టుకోరు. మన జీవితంలో జరిగే విషయాలను కలలు గ్రహించడం వలన, వాటిని ఎదుర్కొంటాము.
కలలో వర్షం కనబడితే శుభమా, అశుభమా అని చాలా మంది సందేహిస్తారు. అయితే, స్వప్న శాస్త్రం ప్రకారం, ఎప్పుడైతే కలలో వర్షం కనబడుతుందో, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా జీవితంలో విజయాన్ని కూడా పొందుతారు. ముఖ్యంగా, రిలేషన్షిప్ కు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి అని స్వప్న శాస్త్రంలో చెప్పబడింది. ఎప్పుడైతే కలలో వర్షాన్ని చూస్తారో ఎన్నో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. పైగా సానుకూల శక్తి పెరుగుతుంది. ఆర్థికంగా మాత్రమే కాకుండా, కుటుంబ సభ్యుల మధ్య కూడా ఆనందం ఏర్పడుతుంది. ఈ విధంగా, మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.
ఎప్పుడైతే కలలో భారీ వర్షం లేదా ఈదురు గాలులతో కూడిన వర్షం కనిపిస్తుందో, మీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు మరియు సమస్యలకు ఇవి సంకేతం. ఇటువంటి కలలు రావడం వలన ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కాకపోతే ఇలాంటి కలలు వచ్చినప్పుడు మానసిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి మరియు ఎన్నో సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. కొంతమంది కలలో వర్షంలో తడిసినట్లు అనుభూతిని పొందుతారు. అయితే అలాంటి సందర్భాలలో మీరు లోతైన భావోద్వేగానికి గురవుతున్నట్లు సంకేతం. ఇటువంటి కలలు వచ్చినప్పుడు కొత్త సంబంధం ప్రారంభం అవుతుంది లేదా పాత సంబంధాలు మరింత బలపడతాయని స్వప్న శాస్త్రం చెబుతోంది.