ఈ కూరగాయని తీసుకుంటే డయాబెటిస్, క్యాన్సర్ సమస్య తగ్గుతుంది..!

చాలా ఇష్టంగా తినే కూరగాయలలో బెండకాయ కూడా ఒకటి. బెండకాయలతో తయారు చేసిన
వంటకాలు రుచికరంగా మాత్రమే కాదు ఆరోగ్యకరం కూడా. బెండకాయలలో చాలా పోషక విలువలు కలిగి ఉంటాయి. డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు ఎటువంటి కూరగాయలు తినాలో తెలియక ఎంతో తికమక పడతారు.

అయితే బెండకాయను తినడం వల్ల డయాబెటిస్ రోగులు కూడా ఎటువంటి ఇబ్బంది కలగదు. బెండకాయలలో విటమిన్ ఏ, సి, కె, క్యాల్షియం మరియు మెగ్నీషియం వంటి వాటిని పొందవచ్చు. ఇటువంటి పోషక విలువల లోపం ఉన్నవారు కచ్చితంగా బెండకాయను క్రమంగా మీ ఆహారంలో భాగంగా తీసుకోండి.

విటమిన్ సి లో వాటర్ సాల్యుబుల్ ఎలిమెంట్స్ ఉంటాయి. దాని వల్ల రోగ నిరోధక వ్యవస్థ చాలా మెరుగుపడుతుంది. అంతే కాదు బెండకాయలలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఫైబర్ మరియు ప్రోటీన్ కూడా పొందవచ్చు. వీటితో పాటుగా బెండకాయలలో లెక్టిన్ అనే ప్రోటీన్ ఉంటుంది.

దానివల్ల శరీరంలో ఉండే క్యాన్సర్ కణాలు ఎదకకుండా చేస్తుంది. ఒక పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే బెండకాయలను లేదా బెండకాయ యొక్క ఎక్స్ట్రాక్ట్ ను డయాబెటిస్ పేషెంట్లకు ఇవ్వడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి అని కనుగొన్నారు. గర్భిణీ స్త్రీలకు ఫోలేట్ ఎంతో అవసరం, ఇది బెండకాయలలో కూడా ఉంటుంది.