ప్రస్తుత కాలంలో గుండెజబ్బులు సర్వసాధారణమైపోయాయి. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఈ గుండె సంబంధిత వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. గుండె సంబంధిత వ్యాధితో బాధపడే వారికి ఓ శుభవార్త చెప్పారు వైద్యులు. ఆస్ట్రేలియాలో కనిపించే ఫనెల్ వెబ్ స్పైడర్ అనే సాలీడు కాటు విషపూరితంగా అందరూ భావిస్తారు. సమయానికి చికిత్స అందించకపోతే ప్రాణాంతకం అవుతుంది. అయితే ఈ విషయమే లక్షల ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు శాస్త్రజ్ఞులు.
గుండెపోటు వచ్చినప్పుడు ఒక్క సారిగా అవయవానికి… రక్త సరఫరా తగ్గిపోతుంది. ఫలితంగా గుండె కణాలకు ఇక చనిపోయారు అనే సంకేతం అందుతుంది. ఈ సంకేతాన్ని ఆపగలిగితే మాత్రం ప్రాణాన్ని కాపాడినట్లే. అయితే ఫనెల్ వెబ్ స్పైడర్ విషం లోని హెచ్ ఐ-1a అనే ప్రోటీన్ కు ఈ సంకేతాన్ని ఆపగల శక్తి ఉందని రుజువు చేశారు శాస్త్రవేత్తలు. బ్రెయిన్ డెడ్ అయిన వారి గుండెను దానం చేసే సమయంలోను ఈ ప్రక్రియ ఏ మాత్రం ఆలస్యం అయినా గుండె దెబ్బతినే అవకాశం ఉంది. ఈ సందర్భంలో కూడా హెచ్ ఐ-1a ప్రోటీను చాలా ఉపయోగపడుతుంది అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.