ఎండాకాలంలో ఏసీ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పెరగడం వలన ఏసీని ప్రతిరోజు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఏసీ గదిలో కొన్ని రకాల తప్పులను చేయకూడదు. ఇంట్లో, ఆఫీసులో లేదా దుకాణాల్లో ఏసీలను ఉపయోగించినప్పుడు ఈ తప్పులను చేయడం వలన ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. కనుక వీటి గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఎప్పుడూ కూడా 24 నుండి 26 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ను మాత్రమే సెట్ చేసుకోవాలి. చాలా శాతం మంది ఎక్కువ వేడి ఉంది అని 16 నుండి 18 డిగ్రీల వరకు సెట్ చేస్తారు.
దీని వలన గది త్వరగా చల్లగా అవుతుందని భావిస్తారు. కానీ ఇలా చేయడం వలన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్ లు, శ్వాసకోశ సమస్యలు వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే విద్యుత్ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. ఏసీ గదిలో చల్లని ఉష్ణోగ్రత ఉండాలి అంటే తలుపులు, కిటికీలు తెరిచి ఉంచకూడదు. బయట గాలి లోపలికి వచ్చినప్పుడు ఉష్ణోగ్రత మారిపోతుంది. అందువలన ఏసీ కంప్రెషర్ పై ఒత్తిడి పెరుగుతుంది. దీని వలన కరెంటు బిల్లు కూడా ఎక్కువగా వస్తుంది.
ఏసీ గదిలో చెమటలతో ఉండడం, స్నానం చేసిన వెంటనే ఏసీ గదిలోకి రావడం మంచిది కాదు. ఎప్పుడైతే శరీర ఉష్ణోగ్రత ఆకస్మాత్తుగా తగ్గుతుందో, ఆరోగ్యం దెబ్బతింటుంది. దగ్గు, కండరాల నొప్పులు, జలుబు, కీళ్ల నొప్పులు వంటి మొదలైన ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. తడి బట్టలతో ఏసీ గదిలో కూర్చోవడం వలన మరింత చల్లగా అనిపిస్తుంది. దీని వలన మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కనుక ఇటువంటి పొరపాట్లు చేయకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అలాగే కరెంటు బిల్లు ను కూడా ఆదా చేయవచ్చు.