Mirai Telugu Teaser: టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా పేరు ఇప్పుడు తెలియని వారుండరు. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ మూవీ ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందే అందరికీ తెలిసిందే. ఈ మూవీతో పాన్ ఇండియా హిట్ కొట్టేసిన తేజ సజ్జా తరువాత ప్రాజెక్ట్ కి రెడీ అయిపోయాడు.

తేజ సజ్జా ప్రధానపాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘మిరాయ్’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. టీజర్‌లో ‘కలియుగంలో పుట్టిన ఏ శక్తీ దీన్ని ఆపలేదు’ అనే డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. మూవీలో మంచు మనోజ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.