Air fryer : ఎయిర్ ఫ్రైయర్ ఇంత ప్రమాదమా..? ఆరోగ్య నిపుణులు ఏం అంటున్నారంటే..?

-

రోజురోజుకీ టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది. కొత్త కొత్త పరికరాలని కూడా మనం ఉపయోగిస్తున్నాము. గ్యాస్ స్టవ్ మొదలు మైక్రోఓవెన్, ఎయిర్ ఫ్రైయర్స్ వరకు చాలా రకాల కొత్త కొత్త వస్తువులను మనం ఉపయోగిస్తున్నాము. చాలా మంది ఈ రోజుల్లో ఎయిర్ ఫ్రైయర్స్ ని కూడా వాడుతున్నారు. వంటకాలు చేయడం వలన చక్కగా క్రిస్పీగా ఆహార పదార్థాలు వస్తాయని చాలామంది కొనుగోలు చేస్తున్నారు. ఎయిర్ ఫ్రైయర్స్ కి డిమాండ్ పెరిగింది, అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం ఎయిర్ ఫ్రైయర్స్ ప్రమాదకరం అని అంటున్నారు.

ఎయిర్ ఫ్రైయర్స్ నాన్ స్టిక్ కాబట్టి వాటిని తయారు చేయడానికి టెఫ్లాన్ వంటివి వాడతారు. దీనిలో పూర్తిగా కెమికల్స్ ఉండడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. నాన్ స్టిక్ మెటీరియల్స్ ఎప్పుడు కూడా పూర్తిగా కెమికల్స్ తో తయారు చేయబడతాయి. నాన్ స్టిక్ లేయర్ పాడైతే వాటిని ఉపయోగించడం మంచిది కాదు. దాని వలన హానికరమైన కెమికల్స్ ప్రొడ్యూస్ అయ్యి ఆహార పదార్థాల్లోకి చేరతాయి. అటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు వ్యాపిస్తాయి. పాడైన ఎయిర్ ఫ్రైయర్స్ వంటి వాటిని వీలైనంత వరకు ఉపయోగించకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

నాన్ స్టిక్ కోటింగ్ డామేజ్ అవ్వకుండా చెక్క లేదా సిలికాన్ పాత్రలు ఉపయోగించడం మంచిది. మెటల్ వంటి వాటిని ఉపయోగించవద్దు. క్లీన్ చేసేటప్పుడు కూడా మెటల్ వంటి వాటిని ఉపయోగించకండి. దాని వలన నాన్ స్టిక్ కోటింగ్ దెబ్బతిని అది ఇంకా ప్రమాదకరంగా మారుతుంది. ఒకవేళ నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న వాటిని ఉపయోగించాలని మీరు అనుకోకపోతే స్టైన్లెస్ స్టీల్, సిరామిక్ వంటి వాటిని ఉపయోగించవచ్చు. ఎయిర్ ఫ్రైయర్ వాడడం వలన తక్కువ నూనెతో మనం చాలా వంటకాలని తయారు చేసుకోవడానికి అవుతుంది. డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి కొలెస్ట్రాల్ రిస్క్ పెరుగుతుంది. గుండె సమస్యలు, స్ట్రోక్, డయాబెటిస్ వంటివి కలుగుతాయి కాబట్టి ఒక విధంగా వీటిని వాడడం మంచిదే కానీ కొన్ని సమస్యలు అయితే తప్పవని గుర్తు పెట్టుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news