ఆగండి ఆగండి, పిల్లలకు ముద్దు పెట్టకండి…!

-

చిన్న పాప, బాబు కనపడితే సాధారణంగా మనం ఎం చేస్తాం చెప్పండి…? ముద్దొస్తారు కాబట్టి వెంటనే దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టేస్తాం. మన భారతీయులు అయితే తొందర ఎక్కువ కాబట్టి పక్కన వాళ్ళ చేతుల్లో ఉన్నా సరే ముందుకి వంగీ మరీ ముద్దులు మీద ముద్దులు పెడతారు. ఒక్క ముద్దుతో ఆపుతారా…? బుగ్గల మీద పెదవుల మీద దొరికిందే అవకాశం అనుకుంటారో ఏమో పెట్టేస్తూ ఉంటారు.

కాని పాపం ముద్దు పెట్టె ముందు ఒక విషయం తెలుసుకోండి. మీకు ముద్దు వస్తే ఆడుకోండి గాని అలా ముద్దు పెట్టేయకండి. అది వాళ్లకు అంత మంచిది కాదంట. ఈ విషయాన్ని అమెరికా వైద్యులు చెప్పారు. అమెరికాలోని పిల్లలు వైద్యనిపుణులు కరిన్‌ నీల్సన్‌ ఈ విషయంలో ఒక వార్నింగ్ ఇచ్చారు. పెదవులపై చిన్నచిన్న పుండ్లు రావడానికి కాణమయ్యే హెచ్‌ఎస్వీ-1,

వంటి వైర్‌సలు మీరు పెట్టె ముద్దు ద్వారా పెద్దల నుంచి పిల్లలకు చేరుతాయని ఆందోళనకర విషయం చెప్పారు. దీనివల్ల చిన్నారులకు దద్దుర్లు, పుండ్లు, జ్వరం వస్తాయని హెచ్చరిస్తున్నారు. అవి వచ్చినప్పుడు వెంటనే చికిత్స అందకపోతే, శిశువు చూపు కోల్పోవడమే ఒకటే కాకుండా కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు దెబ్బ తినే అవకాశాలు మెండు గా ఉన్నాయని ఆయన హెచ్చరించారు. కాబట్టి ముద్దు వద్దు ప్లీజ్ నా…?

Read more RELATED
Recommended to you

Exit mobile version