పైల్స్ వీటిని మొలలు అని కూడా అంటారు వీటి గురించి చెప్పాలంటే బాధితుడికి నరకాన్ని చూపిస్తాయి పైల్స్ ఉన్నవారు ఎక్కువగా ఏ పని చేయలేరు నడవలేరు ఒకచోట కూర్చోలేరు నానా అవస్థలు పడుతూ ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ సమస్య ఉన్నవారు వారి ఆహారపు అలవాట్ల విషయంలో కొన్ని జాగ్రత్తలను పాటించాలి కొన్ని రకాల ఆహార పదార్థాలను అసలు తినకూడదు వాటికి ఫైల్స్ వచ్చిన వారు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంత త్వరగా సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు మరి ఎలాంటి ఆహార అలవాట్లను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పైల్స్ ఉన్నవారు మలబద్ధకంతో ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు వీరు బయటికి చెబితే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని గిల్టీగా ఫీల్ అవుతుంటారు ఇలాంటి అనారోగ్యాలు అసలు నిర్లక్ష్యం చేయకూడదు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని వైద్యులు సూచిస్తున్నారు ముఖ్యంగా పైల్స్ ఫిస్టులా వంటి సమస్యలు ఉన్నవారు వారు తిని ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని రకాల వంటలకు మీరు దూరంగా ఉంటే మంచిదని డాక్టర్స్ సూచిస్తున్నారు మరి పైల్స్ ఫిస్టులా ఉన్నవారు ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదు వేటికి దూరంగా ఉండాలో చూద్దాం..
జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండడం : ప్రాసెస్ ఆహారాలు ఫాస్ట్ ఫుడ్స్ బర్గర్లు పిజ్జాలు వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. వీటిలో ఫైబర్ తక్కువగా ఉంటుంది పీచు పదార్థం లేని ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ మందగించి మలబద్ధకాన్ని ప్రేరేపిస్తుంది ఇది పైల్స్ లక్షణాలను మరింత ఎక్కువ చేస్తుంది అందుకే ఫాస్ట్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలని డాక్టర్స్ సూచిస్తున్నారు.
అధిక ఉప్పు ఉన్న ఆహారాలు దూరం : ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను పైస్ ఉన్నవారు తింటే శరీరంలో నీటి నిలుపుకోవడానికి కారణమవుతుంది ఇది రక్తనాళాలపై ఒత్తిడిని పెంచి ఫైల్స్ ఉన్నవారి లక్షణాలను తీవ్రతరం చేస్తుంది. అధికంగా ఉప్పు వాడడం వల్ల రక్తపోటు కూడా పెరుగుతుంది. చిప్స్ ఊరగాయలు సాస్ వంటి పదార్థాలలో ఉప్పు అధికంగా ఉంటుంది అందుకే వీటికి దూరంగా ఉండాలి.

మసాలా ఆహారాలు కు మానుకోవటం : మనం బయట తినే ఆహారాలే కాక ఇంట్లో వండుకునే వాటిలోనూ ఎక్కువ మసాలా ఆహారాలను ఇష్టపడుతుంటాం. ముఖ్యంగా ఫ్రై ఐటమ్స్ అంటే చాలామంది ఇష్టపడుతుంటారు కానీ అందులో కారం ఎక్కువగా ఉంటుంది మసాలా ఫుడ్స్ లో ఎక్కువ పచ్చిమిర్చి, మిరియాలు కారం అధికంగా ఉండడంతో, మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది ఇవి మంట దురద నొప్పిని పెంచుతాయి ముఖ్యంగా పైల్స్ ఉన్న వారిలో ఈ చిరాకు ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని తగ్గించాలి అని డాక్టర్స్ సూచిస్తున్నారు.
గమనిక: (ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడింది. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ కు ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం మీరు మీ వైద్యుని సంప్రదించడం మంచిది.)