Meenakshi Natarajan: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 31 నుంచి నియోజకవర్గాల్లో మీనాక్షి పాదయాత్ర ఉంటుంది. వారం రోజుల పాటు నియోజవర్గాల్లో సాగనున్న మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయనున్నారు.

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం నుంచి ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధోల్, అర్ముర్, ఖానాపూర్, చొప్పదండి, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నారు.
- మీనాక్షి నటరాజన్ పాదయాత్రకు సంబంధించిన షెడ్యూల్ విడుదల
- పాదయాత్రకు ఐదుగురు కోఆర్డినేటర్లు నియామకం
- జులై 31న సాయంత్రం 5 గంటలకు పరిగి నుంచి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ప్రారంభం
- ఆగస్టు 6న వర్ధనపేటలో పాదయాత్ర ముగింపు