ఆరోగ్యనికి చెరకు పంచదార మంచిదా? బీట్‌ పంచదార మంచిదా?

-

చెరకు పంచదార, బీట్ పంచదార ఈ రెండు రకాల పంచదారను మనం నిత్యం వంటలలో, జ్యూస్ లలో వాడుతుంటాం. కానీ ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది నిజానికి ఈ రెండు రకాల పంచదారల మధ్య పోషకాపరంగా పెద్ద తేడా ఉండదు. అయితే వాటి తయారీ విధానాలు, వాటిలో ఉండే కొన్ని సూక్ష్మమైన పోషకాల వల్ల వాటి ప్రభావం కొద్దిగా మారుతుంది. ఏది ఉత్తమమైందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

చెరకు పంచదార: చెరుకు రసం నుంచి తయారు చేసే పంచదార ఇది. ఇందులో చెరుకు మొక్కల్లో సహజంగా ఉండే కొన్ని ఖనిజాలు, విటమిన్లు చాలా తక్కువ మొత్తంలో మిగిలి ఉంటాయి. చెరకు పంచదార తయారీ సాంప్రదాయ పద్ధతులను ఉపయోగిస్తారు. ఇందులో రసాయనాల వాడకం తక్కువగా ఉంటుంది. ఈ పంచదారకు కొద్దిగా గోధుమ రంగు రావడానికి కారణం ఇందులో ఉండే బెల్లం ఇది పూర్తిగా శుద్ధి చేయబడితే తెల్లగా మారుతుంది.

బీట్ పంచదార : బీట్రూట్ మొక్క నుంచి తయారు చేసే పంచదార ఇది . ఈ పంచదార తయారీకి ఎక్కువ టైం పడుతుంది దీనివల్ల బీట్రూట్ లో ఉండే సహజ పోషకాలు పూర్తిగా తొలగిపోతాయి అందుకే ఇది పూర్తిగా తెల్లగా ఉంటుంది బీట్ పంచదారకు ప్రత్యేకమైన రుచి ఉండదు కాబట్టి దీనిని ఎక్కువగా ఆహార పరిశ్రమల్లో వాడుతారు.

Sugar Showdown: Jaggery vs Beet Sugar for Your Health

 ఆరోగ్య పోషకాలు : పోషకాల పరంగా చూస్తే ఈ రెండింటిలోనూ దాదాపు ఓకే రకమైన సుక్రోచ్  ఉంటుంది. చక్కెరలో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. మీరు ఏ రకం పంచదారని తీసుకున్న అది మీ శరీరంలో ఒకే విధంగా శక్తిని విడుదల చేస్తుంది.

చెరకు పంచదారకు కొద్దిగా క్యారమెల్ వంటి రుచి ఉంటుంది. బీట్ పంచదారకు అలాంటి ప్రత్యేకమైన రుచి ఉండదు. ఈ రెండు పంచదారుల గ్లైసేమిక్ ఇండెక్స్ దాదాపు ఒకేలా ఉంటుంది. అంటే ఈ రెండు రక్తంలో చక్కెర స్థాయిలను ఒకే వేగంగా పెంచుతాయి.

చివరగా చెప్పాలంటే ఆరోగ్యపరంగా ఈ రెండు రకాల పంచదారలు  మధ్య పెద్ద తేడా లేదు. రెండు శుద్ధి చేయబడిన చెక్కరలే. మీకు ఏ రకం పంచదార అయినా పర్వాలేదు. ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఎంత చక్కెరను తీసుకుంటున్నారు అనేది ముఖ్యం. చక్కెరను ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news