సీఎం చంద్రబాబు నాయుడు చిన్నారిని ఎత్తుకొని లాలించారు. నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్బంగా రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు ఇటీవల జన్మించిన కుమారుడికి ఆశీస్సులు అందించారు చంద్రబాబు.

రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు ఇటీవల జన్మించిన కుమారుడిని చంద్రబాబు నాయుడు ఎత్తుకున్నారు. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా , నేడు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్బంగా స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇవాళ సాయంత్రం పార్టీకి చెందిన పలువురు నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టనున్నారు.