అసెంబ్లీలో చీల్చి చెండాడుతామని కాళేశ్వరం రిపోర్టుపై కేసీఆర్, హరీష్ రావు నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తీర్పుపై ఎర్రవెల్లి నివాసంలో హరీష్ రావు, ఇతర కీలక నాయకులతో కేసీఆర్ భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి కోరుకున్నట్టే అసెంబ్లీలోనే కాళేశ్వరంపై కుట్రలను ఎండగట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరం గురించి వాస్తవాలను ప్రజలకు తెలియజేసే బాధ్యత హరీష్ రావుకు అప్పజెప్పారు కేసీఆర్. రేవంత్ రెడ్డి అసెంబ్లీ పెట్టడమే ఆలస్యం..దుమ్ము దులిపేందుకు సిద్ధం అవుతున్నారు హరీష్ రావు.