వేసవి లో నీరసం రాకుండా ఉండాలంటే ఈ ఆహారపదార్ధాలను తీసుకోండి..!

-

వేసవిలో ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల నీరసం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే కంఫర్టబుల్ గా ఉండదు. వేడి వల్ల డీహైడ్రేషన్, ఆకలి తగ్గిపోవడం, చికాకుగా ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని సరైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. లేదంటే ఎనర్జీ లెవల్స్ బాగా తగ్గిపోతాయి అయితే ఎండా కాలంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది..? ఎలా ఆరోగ్యంగా ఉండొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.

 

మీరు రోజంతా ఆక్టివ్ గా ఉండాలి అంటే పెసలు, నట్స్, గింజలు వంటివి తీసుకుంటూ ఉండాలి. అదే విధంగా పోషక పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. హైడ్రేషన్ చాలా ముఖ్యం. కాబట్టి డ్రింకులకి బదులుగా నిమ్మ రసం, కొబ్బరి నీళ్లు, బార్లీ వంటివి తాగుతూ ఉండాలి.

ఉదయం పూట అల్పాహారం సమయంలో వీటిని తీసుకోండి:

అమైనో యాసిడ్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు గుడ్లలో ఉంటాయి. అలాగే పాలు కూడా తీసుకోండి. పాలలో కాల్షియం, ప్రొటీన్ ఉంటుంది ఇవి బాడీ ని యాక్టివ్ గా ఉంచుతుంది. గుడ్లు మరియు పాలలో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేస్తాయి అలానే డీహైడ్రేషన్ సమస్య కూడా ఉండదు.

ఈ పండ్లను తీసుకోండి:

పుచ్చకాయ, కర్బూజ, పైనాపిల్, స్ట్రాబెరీ, మ్యాంగో వంటి వాటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. హైడ్రేషన్ సమస్య వేసవి కాలంలో ఉండకుండా ఉండాలంటే ఈ పండ్లు తీసుకుంటూ ఉండండి.

ఈ కూరగాయలను తీసుకోండి:

ఆనపకాయ, బ్రోకలీ, కీరదోస సమ్మర్ లో తీసుకుంటే మంచిది. ఎందుకంటే వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది అలానే లోబిపి సమస్యను కూడా తొలగిస్తాయి.

స్నాక్స్ సమయంలో వీటిని తీసుకోండి:

నట్స్, పండ్లు, పెసలు వంటి వాటిని మీరు స్నాక్స్ గా తీసుకోవచ్చు. అదే విధంగా హైడ్రేట్ గా ఉండడానికి ఎక్కువ నీళ్ళు తీసుకోండి. మసాలా పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. తక్కువ మసాలా మాత్రమే తీసుకోండి. అల్లం, మిరియాలు, వెల్లుల్లి వంటివి తీసుకుంటే జీర్ణ సమస్యలు కలగకుండా ఉంటాయి కాబట్టి ఈ సమ్మర్ లో డైట్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version