జికా వైరస్ రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి…!

-

అనారోగ్య సమస్యలు వచ్చాయంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడానికి చూసుకోవాలి. జికా వైరస్ దోమల నుంచి వస్తుంది. దీని కారణంగా డెంగ్యూ వైరస్, ఎల్లో ఫీవర్ వైరస్ వంటివి వస్తాయి. అయితే జికా వైరస్ రాకుండా ఉండటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిని కనుక అనుసరిస్తే ఖచ్చితంగా జిక వైరస్ బారిన పడకుండా ఉండొచ్చు. జికా వైరస్ కి ఇంకా వ్యాక్సిన్ లేదు కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి.

 

ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి:

సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ గర్భిణీలు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. అలానే ప్రయాణికులు ప్రయాణం చేసే సమయంలో ఆహారం, నీళ్లు మంచివో కాదో చూసుకుని తీసుకోవాలి. ఎక్కడపడితే అక్కడ ఆహారం తీసుకోద్దు. హైజీన్ గా వుండే చోట మాత్రమే తీసుకోండి.

గాలి వెలుతురు బాగా వచ్చే చోట ఉండడం:

వైరస్ ఎక్కువగా దుమ్ము ధూళి వంటి ప్రదేశాల్లో వస్తుంది. వీలైనంతవరకూ గాలి వెలుతురు బాగా వచ్చే గదిలోనే ఉండండి. ఒకవేళ కనుక దోమలు ఎక్కువగా ఉంటే దోమతెర వంటివి ఉపయోగించండి.

రక్షణనిచ్చే దుస్తులు ధరించడం:

పొడవాటి చేతులు ఉండే దుస్తులు ధరించడం అలవాటు చేసుకోండి. వీలైతే సాక్సులు వేసుకోవడం లాంటి జాగ్రత్త తీసుకుంటే దోమలు కుట్టకుండా ఉంటాయి.

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి:

ఇంట్లో ఎక్కువ నీరు నిల్వ ఉండిపోవడం వల్ల దోమలు పెరుగుతాయి. అలా ఉండకుండా ఎప్పటికప్పుడు ప్రతి దానిని శుభ్రంగా ఉంచుకోండి. అప్పుడు దోమలు రాకుండా ఉంటాయి అలాగే ఎటువంటి వ్యాధులు కూడా రావు. కనుక ప్రతీ ఒక్కరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అప్పుడే ఈ వైరస్ వంటివి సోకవు.

Read more RELATED
Recommended to you

Latest news