హృదయ సమస్యలు రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

-

ఈ మధ్య కాలంలో చాలా మంది హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. హృదయ సంబంధిత సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు తమ యొక్క ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. మనం తీసుకునే ఆహారం, జీవనశైలి బట్టి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది అయితే హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.

ఆరోగ్యకరమైన బరువు:

సరిగ్గా ఆహారం తీసుకుంటూ, ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఆరోగ్యకరమైన బరువు ఉండేలా చూసుకోండి. ఓవర్ వెయిట్, అండర్ వెయిట్ లేకుండా తగినంత బరువు తో ఉంటే సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువ.

పండ్లు కూరగాయలు తీసుకోండి:

మీ యొక్క డైట్ లో పండ్లు, కూరగాయలు ఎక్కువ తీసుకోండి. పోషక పదార్థాలు బాగుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలానే ఎక్కువ ఫైబర్ కూడా వీటిలో ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ప్రోటీన్ ఉండే ఆహారం:

ప్రోటీన్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోండి. సోయాబీన్స్, టోఫు మొదలైన ఆహార పదార్థాలను డైట్ లో ప్రతి రోజు తప్పక తీసుకోండి. ప్రాసెస్డ్ ఫుడ్ కి దూరంగా ఉండండి. ఆర్టిఫిషియల్ రంగులు, సాల్ట్, షుగర్ వంటి ఆహార పదార్థాలు తగ్గించడం మంచిది. అలానే షుగర్ తో వున్న డ్రింక్స్ కి కూడా దూరంగా ఉండాలి. అలానే తక్కువ ఉప్పుని ఆహారంలో ఉపయోగించాలి ఎక్కువ ఉప్పు వాడితే ముప్పు కలుగుతుంది అని గ్రహించండి. ఇలా జాగ్రత్తగా వుంది తప్పులు చేయకుండా ఉంటే హృదయ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version