ఎండిన అల్లంతో అనేక ప్రయోజనాలు.. కానీ ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం అస్సలు తినొద్దు

-

అల్లం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. పొట్టలో పేరుకుపోయిన చెడు కొలస్ట్రాల్ తగ్గించటంలో అల్లం వాటర్ బాగా ఉపయోగపడుతుంది. ఇక మాసాలా వంటల్లో అల్లం వెల్లుల్లి పడాల్సిందే. అలాగే ఎండిన అల్లంతో కూడా చాలా లాభాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. పీచు, సోడియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫోలేట్, ఫ్యాటీ యాసిడ్స్ వంటి అనేక గుణాలు అన్నీ ఎండిన అల్లంలో ఉన్నాయట. ఇది అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ఇంకా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం.

ఎండిన అల్లంతో లాభాలు

కఫం సమస్యను తగ్గించడంలో ఎండిన అల్లం ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఎండిన అల్లం జలుబు, దగ్గు తగ్గించడంలో సహయపడుతుంది.
కడుపు సమస్యలు, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
ఎండు శొంఠి పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే అజీర్తి, గ్యాస్ సమస్య తగ్గుతుంది.
అజీర్ణం, గ్యాస్ సమస్యను తగ్గించడమే కాకుండా.. ఆహారాన్ని జీర్ణం చేయడంలో బాగా పనిచేస్తుంది.
వాతం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఆకలి మందగించడం వంటి సమస్యలు ఉన్నప్పుడు ఎండు అల్లం పొడిని రాక్ సాల్డ్ లో కలిపి తింటే సమస్య తగ్గుతుంది.
కడుపు సమస్యలు, తిమ్మిర్లు, లూజ్ మోషన్ వంటి సమస్యలు తగ్గించుకోవడానికి గోరు వెచ్చని నీటితో కలిపి ఎండిన అల్లం తీసుకుంటే చాలు సమస్యే ఇట్టే మాయంమవుతుంది.

ఈ సమస్యలు ఉన్నవారు తినకూడదు..

ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఎండిన అల్లాన్ని కానీ అందరూ తినకూడదు..మఖ్యంగా ఈ సమస్యలు ఉన్నావుర తినకూడదట.
ఎండు అల్లం వేడి చేస్తోంది..అందుకే గర్భధారణ సమయంలో పొడి అల్లం తీసుకోవద్దు అంటున్నారు వైద్యులు.. శరీరంలోని మంటలు లేదా ఏదైనా గాయం ఉన్నవారు ఎండు అల్లం అస్సలు తీసుకోకూడదు. ఎండకాలంలో ఎండు అల్లం అస్సలు తినకూడదు. జ్వరం వచ్చినప్పుడు ఎండిన అల్లం తీసుకోవద్దు.

కాబట్టి మంచిదేకదా అని అందరూ వాడటానికి లేదు. పైన పేర్కొన్న సమస్యల్లో మాత్రమే.. తీసుకోవాలి అంతేకాదు..ముందుగా చెప్పిన కేటగిరిలో లేకుంటేనే. మంచికిపోయి చెడు ఎదురువటం అంటారు..కదా అలా అవుతుంది..జ్వరం వచ్చినప్పుడు అల్లంతీసుకుంటే. గర్భీణీలు కూడా అల్లంజోలికి పోవద్దు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version