స్టార్ ఫ్రూట్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..ముఖ్యంగా బరువు తగ్గేందుకు భలే పనిచేస్తుందట.!

-

ఆరోగ్యంగా ఉండాలంటే..తినాల్సింది రుచికరమైన ఆహారం మాత్రమే కాదు…పోషకాలతో నిండిన ప్లేట్ కావాలి. అందుకే అప్పుడప్పుడైనా…కొన్ని పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలి అంటారు వైద్యులు. పుట్టగొడుగులు, బ్లూబెర్రీస్ , కాయధాన్యాలు, ఆకుకూరలు వంటి వాటిని చేర్చుకోమని పోషకాహార నిపుణులు ఎప్పూడూ చెప్తూనే ఉంటారు. వీటిల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు నిండి ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇలాంటిదే..కారాంబోలా, లేదా స్టార్ ఫ్రూట్ ఉష్ణమండల ఆగ్నేయాసియాకు చెందిన చెట్టు జాతి. నక్షత్ర ఆకారంలో కనిపించే ఈ పండు జ్యూసీ జ్యుసీగా ఉండడమే కాదు బాగా పండిన పండ్లు పసుపురంగులోకి మారి మరీ.. తియ్యగా ఉంటాయి. పచ్చి పండ్లు పుల్లగా ఉంటాయి. ఈ స్టార్ ప్రూట్ లో విటమిన్ A,B,C, పుష్కలంగా ఉంటాయి.

స్టార్ ప్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు:

అధికంగా ఫైబర్: ఈ పండులో ఎక్కువ శాతం ఫైబర్, తక్కువ కేలరీలు ఉంటాయి. ఫైబర్ జీర్ణవ్యవస్థకు మంచిదనే విషయం మనందరికి తెలిసిందే..ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తింటే..ప్రేగులు బాగా క్లీన్ అవుతాయి.

కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేస్తకుంది: స్టార్ ఫ్రూట్స్ కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది.. అంతేకాదు రక్తంలోని పేరుకున్న కొవ్వును కూడా తొలగిస్తుందట.

బరువు తగ్గడానికి మంచి సహాయకారి: పోషకాలతో నిండి. తక్కువ కేలరీలు కలిగిన ఈ స్టార్ ఫ్రూట్ బరువు తగ్గడానికి అనువైన పండు. జీవక్రియను పెంచుతుంది. శరీరంలోని ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో ఇది చక్కగా సహాయపడుతుంది.

గుండెకు మంచిది: సోడియం, పొటాషియం, ఇతర ఖనిజాలతో సమృద్ధిగా స్టార్‌ఫ్రూట్స్ లో ఉండటల వల్ల ఇది.. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది..

ఇమ్యూనిటీ పవర్: స్టార్‌ఫ్రూట్‌లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. స్టార్ ఫ్రూట్‌లో మెగ్నీషియం, ఐరన్, జింక్, మాంగనీస్, పొటాషియం . ఫాస్పరస్ ఉన్నాయి. వీటి ద్వారా రక్షణ వ్యవస్థ బాగా చురుకుగా పనిచేస్తుంది.

స్టార్ ఫ్రూట్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి..దొరికితే మీరు ఓ సారి ట్రై చేయండి. ఎప్పుడూ తినే ఆహారాలు, పండ్లే కాదు..అప్పుడప్పుడు కొత్తగా ఉండేవి కూడా తింటూ ఉంటే..రుచికి రుచికి హెల్తీగా కూడా ఉండొచ్చు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version