సహజంగా ముఖం అందంగా మరియు కాంతివంతంగా కనిపించాలంటే ఎంతో నవ్వుతూ అందంగా మాట్లాడుతూ ఉండాలి. కొంతమంది దంతాలు ఎంతో తెల్లగా మెరుస్తూ కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే మరికొందరి దంతాలు పసుపుగా ఉంటాయి. అలాంటి సమయంలో మాట్లాడటానికి మరియు నవ్వటానికి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అయితే తెల్లటి కాంతివంతమైన దంతాలను పొందాలంటే, ఈ చిట్కా ను తప్పకుండా ప్రయత్నించండి. కేవలం నిమ్మకాయను ఉపయోగించి మీ దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు.
దంతాల పై పసుపు ను తొలగించడానికి నిమ్మకాయ ఎంతో మేలు చేస్తుందనే చెప్పవచ్చు. నిమ్మకాయలో ఉండే ఎసిడిటీ మరియు యాంటీ బాక్టీరియల్ గుణాలు బ్యాక్టీరియాను చంపే విధంగా పనిచేస్తాయి. అంతేకాకుండా, దంతాలపై ఉండే మురికి తొలగిపోయి, పసుపు మచ్చలు పోయేలా చేస్తుంది. తెల్లటి దంతాల కోసం ఒక గిన్నె తీసుకొని దానిలో నిమ్మరసం వేసుకోవాలి. దీనిలో కొంచెం ఉప్పు మరియు నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టి, టూత్ బ్రష్ ను ముంచి, దంతాలను ప్రతిరోజూ శుభ్రం చేయాలి. ఇది సహజమైన బ్లీచ్ లా పని చేస్తుంది.
ఈ పద్ధతిని క్రమం తప్పకుండా రెండు నుండి మూడు వారాలు పాటించడం వలన దంతాలు తెల్లగా మారుతాయి. దీంతో ఎంతో అందంగా కనిపిస్తాయి, అలాగే ఇతరులతో మాట్లాడటానికి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. పైగా నిమ్మకాయల లో ఉండే బ్లీచింగ్ గుణాలు దంతాల పై పసుపు మరకలను ఎంతో త్వరగా తొలగిస్తాయి. అంతేకాకుండా, ఉప్పును కలపడం వలన మురికిని మరింత త్వరగా తొలగించుకోవచ్చు. దీని ద్వారా దంతాలపై ఉండే బ్యాక్టీరియా తొలగిపోయి ఎంతో అందమైన మరియు ప్రకాశవంతమైన దంతాలను పొందవచ్చు. కనుక ఇంట్లోనే ఇటువంటి సులభమైన చిట్కాలను పాటించడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు.