స్ట్రాబెర్రీతో ఇన్ని ఉపయోగాలా?

-

చాలామందికి ఎండాకాలం ముఖం మీద ఎర్రటి కురుపులు అవుతుంటాయి. అటువంటి వాళ్లు స్ట్రాబెర్రీ, నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే ఆ కురుపులు మటుమాయమవుతాయి.

స్ట్రాబెర్రీ.. పండు వల్ల ఎన్నో ఉపయోగాలు. దాన్ని తినడం వల్ల వచ్చే ఉపయోగాల కన్నా.. దాన్ని శరీరానికి అప్లయి చేయడం వల్ల కలిగే లాభాలే ఎక్కువ.

ఎండాకాలంలో చాలామంది చర్మం పొడిబారిపోతుంటుంది. పొడిబారిన చర్మానికి, జిడ్డు చర్మానికి స్ట్రాబెర్రీ ద్వారా చెక్ పెట్టొచ్చు. దాని కోసం స్ట్రాబెర్రీ ముక్కలను పెరుగు మీగడతో కలిపి మిక్స్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ఎక్కడైతే పొడిబారిపోయిన చర్మం ఉంటుందో అక్కడ రుద్దాలి. జిడ్డు చర్మం ఉంటే.. పెరుగు, స్ట్రాబెర్రీ ముక్కలను కలిపి మిక్స్ చేసి.. ఆ మిశ్రమాన్ని రుద్దాలి. ఓ పది నిమిషాలు ఆగి.. తర్వాత గోరు వెచ్చని నీటితో కడగాలి. ఇలా రోజూ చేస్తే ముఖం మీద ఉన్న మొటిమలు కూడా మాయమయిపోతాయి.

చాలామందికి ఎండాకాలం ముఖం మీద ఎర్రటి కురుపులు అవుతుంటాయి. అటువంటి వాళ్లు స్ట్రాబెర్రీ, నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే ఆ కురుపులు మటుమాయమవుతాయి.

స్ట్రాబెర్రీ గుజ్జును తీసుకొని కోకోవా పౌడర్, తేనే కలిపి దాన్ని ముఖానికి పెట్టుకుంటే చర్మం కాంతివంతం అవుతుంది. బియ్యం పిండిలో స్ట్రాబెర్రీ గుజ్జును కలిపి.. దాన్ని ఫేస్ ప్యాక్‌లాగానూ వాడుకోవచ్చు. ముఖానికి రుద్దుకొని కాసేపు ఆగి కడుక్కుంటే చర్మం నిగనిగలాడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version