కేరళలోని కొచ్చికి చెందిన ఈ సాఫ్ట్‌వేర్ టెకీలకు వచ్చింది. అందుకే #BirdBathChallenge అని ఒకటి ప్రారంభించారు. ఈ చాలెంజ్‌లో పాల్గొనాలంటే.. మీకు సమీపంలో ఉన్న పక్షుల కోసం నీటిని ఏర్పాటు చేయాలి.
అబ్బబ్బ.. ఎండలు దంచేస్తున్నాయ్. ఉక్కపోతను భరించలేకపోతున్నాం. ఫ్యాన్, ఏసీ, కూలర్ లేకుండా బతకలేం. బయట అడుగు పెట్టలేకపోతున్నాం. ఏం ఎండలురా బాబోయ్.. అని ఊసురుమంటున్నారా? ఇంట్లో ఏసీ వేసుకొని కూర్చునే మనకే అలా ఉంటే.. గూడు లేని పక్షుల ఏమవ్వాలి. ఎండ వేడిని అవి ఎలా తట్టుకోవాలి. వాటి సంరక్షణ ఎవరు చూసుకోవాలి. వాటికి తాగడానికి నీళ్లు ఎక్కడ దొరుకుతాయి. ఒకవేళ దొరకకపోతే వాటి పరిస్థితి ఏంది? అనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా?
కేరళలోని కొచ్చికి చెందిన ఈ సాఫ్ట్‌వేర్ టెకీలకు వచ్చింది. అందుకే #BirdBathChallenge అని ఒకటి ప్రారంభించారు. ఈ చాలెంజ్‌లో పాల్గొనాలంటే.. మీకు సమీపంలో ఉన్న పక్షుల కోసం నీటిని ఏర్పాటు చేయాలి. చిన్న పాత్రలో అయినా సరే.. లేదంటే అక్కడ నీటి తొట్టిని ఏర్పాటు చేసినా సరే. అలా చేసి అక్కడ ఫోటోలు దిగి.. ఈ చాలెంజ్ హాష్‌టాగ్‌తో ఆ ఫోటోలు షేర్ చేసి వాటిని మరో ఐదుగురు ఫ్రెండ్స్‌కు పంపించి.. ఇలాగే చేయమని చెప్పాలి. ఏదో ఒకసారి పక్షుల కోసం నీళ్లు పెట్టడం కాదు.. వేసవి ముగిసే వరకు పక్షుల కోసం అలా నీళ్లు పెడుతూనే ఉండాలి. అదే ఈ సోషల్ మీడియా చాలెంజ్. ప్రస్తుతం ఈ చాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది పక్షులకు నీళ్లు పెడుతూ ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే.. ఇదేదో టైమ్ పాస్ కోసం లేక ఇంకా దేనికో కాదు. పక్షులను కాపాడటం కోసం మనకై మనం చొరవ తీసుకొని చేయాల్సిన పని. అందుకే.. మీరు కూడా ఈ చాలెంజ్‌లో పాల్గొని మీకు దగ్గర్లో ఉన్న పక్షులకు ఈ వేసవిలో నీళ్లు అందించి.. మరో ఐదుగురిని అలాగే చేయమని చెప్పండి.