చిగుళ్ళ నుండి రక్తం కారుతుందా..? లవంగాల నూనె గురించి తెలుసుకోవాల్సిందే

-

లవంగాల నూనె.. దీనిని లవంగాల నుండి తయారుచేస్తారు. ఈ నూనెలో వైద్య సంబంధ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యకరమైన చిగుళ్ల కోసం లవంగాల నూనె సహాయపడుతుంది. ప్రస్తుతం చిగుళ్ళు బలంగా మారడానికి ఆరోగ్యంగా ఉండటానికి లవంగాలనూనె ఏ విధంగా సహాయపడుతుందో తెలుసుకుందాం.

చిగుళ్ళ నొప్పి నుండి ఉపశమనం అందిస్తుంది:

చిగుళ్ళ నొప్పితో మీరు బాధపడుతుంటే.. లవంగాల నూనెను చిగుళ్ల దగ్గర నెమ్మదిగా మర్ధన చేయండి. అయితే ఇలా మర్దన చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. లవంగాల నూనెలో కాస్త నీళ్లు కలపాలి.

చిగుళ్ల వ్యాధిని దూరం చేస్తుంది:

ఇందులో యూజినాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. చిగుళ్ల సమస్యలు వేధిస్తుంటే కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ తో మిక్స్ చేసిన లవంగాల నూనెను చిగుళ్ల మీద మర్దన చేయాలి. దీనివల్ల మంచి ఉపశమనం దొరుకుతుంది.

చెడు వాసన దూరం అవుతుంది:

నోట్లోంచి వచ్చే చెడువాసనకు కారణం చెడు బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా కారణంగా చిగుళ్ళ సమస్యలు ఏర్పడతాయి. ఒక గ్లాసు నీళ్లలో ఒక చుక్క లవంగాల నూనె వేసి.. పుక్కిలించి ఉమ్మి వేయడం వల్ల నోరు ఫ్రెష్ గా తయారవుతుంది.

చిగుళ్ళను బలంగా ఉంచుతుంది:

వారంలో రెండు మూడుసార్ల పాటు నీళ్లు కలిపిన లవంగాల నూనెతో చిగుళ్ళను మర్దన చేస్తుంటే.. చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా బలంగా తయారవుతాయి.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news