బీసీల రిజర్వేషన్లు తగ్గించింది మీరు కాదా : ఆది శ్రీనివాస్

-

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బీసీల పేరుతో మరోసారి రాజకీయం చేయాలని చూస్తోందని ప్రభుత్వ విప్, వేములవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. గతంలో సర్వేలు నిర్వహించి ఏనాడూ నివేదికలు బయట పెట్టని బీఆర్ఎస్ నేడు బీసీ కులగణనపై మాట్లాడుతున్నదని ఫైర్ అయ్యారు. మంగళవారం శాసనసభ వాయిదా అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ..

స్పీకర్ అనుమతితో సభ వాయిదా పడిన దానికి బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని దుయ్యబట్టారు.స్థానిక సంస్థల్లో 34% ఉన్న బీసీల రిజర్వేషన్లు 29% శాతానికి తగ్గించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని, ఆ రోజు బీసీలపై మీకున్న చిత్తశుద్ధి ఏమైందని ప్రశ్నించారు. నాలుగు గోడల మధ్య మాట్లాడి సభ ముగించే పద్దతి మాది కాదని, మీరు అటకెక్కించిన కులగణనలో 51 శాతం బీసీలు ఉంటే మా కుల గణనలో 56 శాతం బీసీలు ఉన్నారని తెలిపారు. సభలో అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరతామని ఆది శ్రీనివాస్ వెల్లడించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version