మీరు వాడుతున్న పసుపు కల్తీదేమో అని సందేహమా..? అయితే ఇలా టెస్ట్ చెయ్యొచ్చు..!

-

పసుపు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పసుపును తీసుకోవడం వలన చాలా సమస్యలకు దూరంగా ఉండొచ్చు కూడా. అయితే వంటల్లో వాడే పసుపు స్వచ్ఛమైనదా కాదా అనేది దాని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలామంది కల్తీ పసుపును వాడుతున్నారు. దాని వలన అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. రోజు రోజుకి ఆహార కల్తీ ఎక్కువ అవడంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. పసిపిల్లలు తాగే పాల నుంచి వంటల్లో ఉపయోగించే కారం, నూనె ఇలా అన్ని రకాల ఆహార పదార్థాలు కల్తీ అవుతున్నాయి.

నకిలీ పసుపుని ఎలా గుర్తించొచ్చు అనేది చూద్దాం.. నీటిలో పసుపు వేస్తే మనం సులువుగా నకిలీ పసుపు కాదని తెలుసుకోవచ్చు కల్తీ పసుపుని గుర్తించడానికి రెండు గ్లాసుల నీళ్లలో ఒక టేబుల్ స్పూన్ చొప్పున పసుపు వేయాలి. స్వచ్ఛమైనదైతే లేత పసుపు రంగులోకి మారి మీరు అడుగుకి చేరుతుంది.

కల్తీ పసుపు అయితే గ్లాసులోని వాటర్ ని పసుపు రంగులోకి మారుస్తుంది. అలాగే నకిలీ పసుపు కొమ్ములని గుర్తించడానికి రెండు గ్లాసులు నీళ్లలో రెండు పసుపు కొమ్ములని వేయాలి. స్వచ్ఛమైన పసుపు కొమ్ములు గ్లాసులోని నీరు రంగు మార్చదు. నకిలీ పసుపు కొమ్ములైతే వాటర్ రంగు మారిపోతుంది. మంచి సువాసనతో పసుపు ఉంటుంది. కల్తీ పసుపు స్మెల్ లేకుండా తక్కువ స్మెల్ కలిగి ఉంటుంది అసలైన పసుపుని ముట్టుకుంటే మృదువుగా ఉంటుంది మెత్తగా ఉంటుంది గరుకుగా అనిపించదు.

Read more RELATED
Recommended to you

Latest news