తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ఠ్. తెలంగాణ రాష్ట్రానికి నేడు, రేపు వర్ష సూచన ఉన్నట్లు ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. పూర్తిగా తిరోగమించిన నైరుతి రుతుపవనాలు కారణంగా.. వర్షాలు పడనున్నాయట. తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతున్నాయట ఈశాన్య రుతుపవనాలు. ఈశాన్య రుతుపవనాల సమయంలో ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు పడతాయని వార్నింగ్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
ఈ శాన్య రుతుపవనాల రాక సమయంలో తీవ్ర ఉక్కపోత వాతావరణం ఉంటుందని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల ఇప్పటికే 34 డిగ్రీల పగటిపూట ఉష్ణో గ్రతలు నమోదు అవుతున్నాయి. ఏపీకి సమీపాన ఉన్న తెలంగాణ జిల్లాలకు వాయుగుండం ప్రభావం ఉంటుందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో ఏపీలో దంచి కొడుతున్నాయి వర్షాలు.